`వకీల్‌సాబ్‌` దర్శకుడు వేణు శ్రీరామ్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. పవన్‌తో సినిమా ప్రకటించగానే తనని సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకున్నారని తెలిపాడు. ఫస్ట్ టైమ్‌ అలాంటి ట్రోల్స్ నాపై రావడం షాక్‌కి గురి చేసిందని అంటున్నారు వేణుశ్రీరామ్‌. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, శృతి హాసన్‌ హీరోయిన్‌గా, అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రధారులుగా `వకీల్‌సాబ్‌` చిత్రం రూపొందుతుంది. దీనికి వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వేణు శ్రీరామ్‌ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. 

`వకీల్‌సాబ్‌`కి దర్శకుడిగా తన పేరు ప్రకటించినప్పుడు తనని దారుణంగా ట్రోల్‌ చేశారని తెలిపారు. `వీడు తప్ప మరే డైరెక్టర్‌ దొరకలేదా` పవన్‌కి అంటూ కామెంట్లు చేశారు. నేను సోషల్‌ మీడియాని పెద్దగా ఫాలో అవ్వను. కానీ ఆ కామెంట్లు చూసినప్పుడు షాక్‌కి గురయ్యాను` అని చెప్పాడు వేణు శ్రీరామ్‌. పవన్‌కి ఇది సరైన రీఎంట్రీగా భావిస్తున్నాని, ఉమెన్‌ఎంపావర్‌ మెంట్‌కి మించిన అంశం మరేముంటుంది అని చెప్పారు. పవన్‌ ఇమేజ్‌కి, తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా ఇందులో కమర్షియల్‌ అంశాలు జోడించామని చెప్పొకొచ్చారు. 

అంతేకాదు ఇందులో పవన్‌ లాయర్‌గా కనిపించనున్నారు. ఆయనకు అపోనెంట్‌ లాయర్‌గా ప్రకాష్‌ రాజ్‌ నటిస్తున్నారు. అయితే ఇందులో నందా అనే పేరుని ప్రకాష్‌ రాజ్‌కి పెట్టడంపై స్పందిస్తూ, `బద్రి` సినిమాలోని నందా పేరునే దీనికి పెట్టామని, ఆ సెంటిమెంట్‌ కోసమే వాడుకున్నామని చెప్పారు. ఈ సినిమాలో పవన్‌ ఇన్‌వాల్వ్ అయ్యారని చెప్పారు. ఆయన కూడా ఓ డైరెక్టర్‌ కాబట్టి, తనకి సామాజిక అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే సలహాలిచ్చారని చెప్పాడు దర్శకుడు. 

ఈ సినిమానే నా వద్దకు వచ్చిందని, తాను ఎవరినీ అప్రోచ్‌ కాలేదన్నారు. అభిమాన హీరోను డెరెక్ట్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది. పవన్ గారితో పనిచేయాలి అనేది నా డ్రీమ్. ఈ ప్రాజెక్ట్ ను ఎంతో సంతోషంగా తీసుకున్నాను.`వకీల్‌సాబ్‌`కి  ముందు మరో టైటిల్‌ అనుకున్నామని, `మగువ.. ` పాట నుంచి టైటిల్‌ పెట్టాలనుకున్నామని, కానీ తెలంగాణలో లాయర్‌ని `వకీల్‌సాబ్‌` అంటారు. అది పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఫిక్స్ చేశామని తెలిపారు వేణు. ఇంకా చెబుతూ,  పవన్‌తో సినిమా ఓ మెమరబుల్‌ అని, షూటింగ్‌ జరిగిన ప్రతి రోజు బెస్ట్ మూవ్‌మెంట్‌ అన్నారు. ఇక అల్లు అర్జున్‌తో `ఐకాన్‌`కి సంబంధించి ఆయన స్పందిస్తూ బన్నీ చేసినప్పుడు ఉంటుందని, ఎప్పుడుంటుందనేది ఆయన నిర్ణయమని, ఉంటుందా? లేదా? అనేది చెప్పలేనని తెలిపారు. కొత్త  సినిమా ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదన్నారు.