సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని డైరెక్టర్ ని అంటారు. ఒక సినిమా ఫలితం ఏదైనా అది దర్శకుడుకే చెందుతుంది. హిట్ అయితే ఆఫర్స్ లేకపోతే కష్టాలు అన్నట్లు ఉంటుంది దర్శకుల పరిస్థితి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా వెంటనే మరో హీరోతో మూవీ దొరుకుతుందన్న గ్యారంటీ ఉండదు. ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి పరిస్థితి కూడా అలానే ఉంది. వంశీ పైడిపల్లి మహేష్ తో మహర్షి మూవీ చేయగా భారీ విజయం అందుకుంది. దీనితో మహేష్ మరో మూవీ చేస్తానని వంశీకి హామీ ఇచ్చారు.

మహేష్ కోసం ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి రెడీగా ఉన్న వంశీకి ఆయన షాక్ ఇచ్చారు. వంశీ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టి పరుశురాంతో మూవీకి మహేష్ సైన్ చేశారు. దీనితో మహేష్ కోసం ఏడాది ఎదురుచూసిన వంశీకి మరో హీరోని వెతుక్కోవడం కష్టమైపోయింది. వంశీ మహేష్ మేనియా నుండి మేల్కొనే లోపు  స్టార్ హీరోలు అందరూ రెండు మూడు వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించేశారు. 

ఇక మిగిలింది రామ్ చరణ్ మాత్రమే. ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించలేదు. దీనితో కనీసం చరణ్ తో మూవీ ఓకే చేయించాలని వంశీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఐతే వంశీ చెప్పిన కథ, కథనాలు చరణ్ కి అంతగా నచ్చలేదని టాక్ వినిపిస్తుంది. మరి చరణ్ కూడా వంశీతో మూవీకి ఒప్పుకోకపోతే  పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు.