Asianet News TeluguAsianet News Telugu

వెంకీ - తరుణ్ భాస్కర్ సినిమా.. ఎందుకు పట్టాలెక్కడం లేదు? ఐదేళ్ల గ్యాప్ అందుకేనా?

దర్శకుడు, రైటర్ తరుణ్ భాస్కర్ - విక్టరీ వెంకటేశ్ కాంబోలో ఈ సినిమా రావాల్సి ఉంది. దానిపై తాజాగా తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. ఇంత ఆలస్యానికి కారణం ఏంటో వివరించారు. 
 

Director Tharun Bhaskar gave Clarity on delay about movie with Venkatesh NSK
Author
First Published Oct 19, 2023, 4:56 PM IST

‘పెళ్లి చూపులు’ సినిమాతో తన దర్శక ప్రతిభను చూపించిన తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) ఈ మధ్యలో సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చారు. ‘ఈ నగరానికి ఏమైందీ’ వంటి యూత్ ఫుల్ ఎవర్ గ్రీన్ మూవీని అందించిన ఆయన.. ఈ రెండు సినిమాల తర్వాత మరే సినిమాను డైరెక్ట్ చేయలేదు. ప్రస్తుతం ‘కీడా కోలా’ (Keeda Cola) అనే క్రేజీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

‘కీడా కోలా’ అనే క్రైమ్ కామెడీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐదేళ్లుగా డైరెక్షన్ పై దృష్టి పెట్టకపోవడానికి కారణం ఏంటీ? వెంకటేశ్ సినిమా కోసమే మీరు ఆగిపోయారా? అంటూ ఎదురైన ప్రశ్నలపై స్పందించారు. సినిమా ఆలస్యానికి, పలు రూమర్లను ఖండిస్తూ బదులిచ్చారు. 

విక్టరీ వెంకటేశ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే దానికి సంబంధించిన స్క్రిప్ట్  వర్క్ ఫైనల్  వరకు వచ్చింది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ ఎండింగ్ సరిగా రావడం లేదు. ఇప్పటికీ ఆ స్టోరీ మీదనే వర్క్ చేస్తున్నాను. పెద్ద హీరో కావడంతో కాస్తా సమయం తీసుకుంటున్నాను. లేదంటే సినిమా ఫ్లాప్ అయితే.. మీరనేది నన్నే కాదా.. మళ్లీ తరుణ్ భాస్కర్ కు పెద్ద హీరోలను హ్యాండిల్ చేయడం రాదంటూ విమర్శిస్తున్నారని ఫన్నీగా బదులిచ్చారు. 

తప్పకుండా వెంకటేశ్ తో సినిమాను పూర్తి చేసి తీసుకొస్తానన్నారు. అంతే గానీ సినిమాలను డైరెక్ట్ చేయకపోవడానికి మరే కారణం లేదనన్నారు. అలాగే నటుడిగానూ, రైటర్ గానూ పలు సినిమాలకు వర్క్ చేస్తుండటంతోనూ కాస్తా ఆలస్యం అయ్యి ఉండచ్చని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం వెంకటేశ్ ‘సైంధవ్’ లో నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తరుణ్ - వెంకీ సినిమా ఎప్పుడొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక కీడా కోలా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాను రానా దగ్గుబాటి ప్రజెంట్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios