Asianet News TeluguAsianet News Telugu

హాట్ కంటెంట్ తో తేజ.. డైరెక్టర్‌గా తన పేరు కాదట!

నెట్ ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలతో వెబ్‌సిరీస్‌లు చేసేందుకు ఎగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్, ప్రశాంత్‌ వర్మ, సంకల్ప్‌ రెడ్డి తదితర యువ దర్శకులు వెబ్‌ సిరీస్‌ షూటింగ్ ల్లో బిజీగా ఉండగా.. ఇప్పుడా జాబితాలో తేజ కూడా చేరిపోయినట్లు సమాచారం అందుతోంది. ఆయన త్వరలో హాట్‌ స్టార్‌ కోసం వెబ్‌ సిరీస్‌లు చేసి పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.  

Director Teja Web Series In Nizam Backdrop
Author
Hyderabad, First Published Aug 6, 2020, 12:19 PM IST

కరోనా పుణ్యమా అని పెద్ద పెద్ద స్టార్ డైరక్టర్స్ సైతం ఓటీటి ల వైపు ప్రయాణం పెట్టుకునే పరిస్దితి వచ్చింది. ఈ  వైరస్‌ వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్‌ పరిస్థితులతో  సినిమా పరిశ్రమ పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో ఇప్పటికే విడుదలకు ముస్తాబైన చిత్రాలు కూడా నిర్మాణ నష్టాలను తగ్గించుకోవడానికి ఓటీటీల బాట పడుతున్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందు ముందు కూడా ఈ ప్రత్యామ్నాయ ఎంటర్టైన్మెంట్ మీడియం ను లక్ష్యంగా చేసుకునే మరిన్ని సినిమాలు రూపొందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే దీనికి తగ్గట్లుగానే పలువురు స్టార్ డైరక్టర్స్  కూడా ఇప్పటి నుంచే వెబ్‌ సిరీస్‌ల వైపు దృష్టిసారిస్తున్నారు.

నెట్ ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలతో వెబ్‌సిరీస్‌లు చేసేందుకు ఎగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్, ప్రశాంత్‌ వర్మ, సంకల్ప్‌ రెడ్డి తదితర యువ దర్శకులు వెబ్‌ సిరీస్‌ షూటింగ్ ల్లో బిజీగా ఉండగా.. ఇప్పుడా జాబితాలో తేజ కూడా చేరిపోయినట్లు సమాచారం అందుతోంది. ఆయన త్వరలో హాట్‌ స్టార్‌ కోసం వెబ్‌ సిరీస్‌లు చేసి పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.  

ఈ మేరకు ఓ వెబ్ సినిమా ని ఆయన తన శిష్యుడు తో కలిసి రూపొందించారట. ఆ శిష్యుడు పేరు రాజేష్. నైజాం ఏరియా బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ వెబ్ సినిమా ...పూర్తిగా బోల్డ్ గా కాస్తంత అడల్డ్ కంటెంట్ మిక్స్ చేసిన ఓ లవ్ స్టోరీగా సాగుతుందిట. ఆర్ ఎక్స్ 100 లాంటి వెబ్ సీరిస్ అంటున్నారు. అయితే ఇలాంటి వెబ్ సినిమాకు తన పేరు ఉండటం మంచిది కాదని భావించిన తేజ ..తన శిష్యుడు పేరుతో వచ్చే నెలలో రిలీజ్ చేయబోతున్నారట.

ఇక  తేజ ఈమధ్య షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్ళి రాగా ఆ తర్వాత వెబ్ సీరీస్ కు సంబందించిన పనులు చూస్తున్నారు. మొదటి ఎపిసోడ్ షూటింగ్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కొద్దిగా సిమ్టమ్స్ రావడంతో ఎందుకైనా మంచిదని టెస్టులు చేయిస్తె కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది.  తనకు కరోనా పాజిటివ్ వచ్చిందన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు డైరక్టర్ తేజ. తన టీమ్ లో కాని, కుటుంబ సభ్యులలో కాని ఎవరిక్ పాజిటివ్ రాలేదని చెప్పారు. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెళ్లడించారు.

అలాగే త్వరలోనే సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్న అమెజాన్‌తో కలిసి తేజ ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే తేజ దృష్టంతా ‘అలిమేలుమంగ వెంకట రమణ’, ‘రాక్షస రాజు రావణాసురుడు’ సినిమాలు పూర్తి చేయడంపైనే ఉన్నట్లు సమాచారం. ఈ రెండు చిత్రాల్లో ఒకదాన్ని హీరో రానాతో మరొకటి గోపీచంద్‌తో తెరకెక్కించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios