టాలీవుడ్ దర్శకులు అప్పుడప్పుడు తాము డైరెక్ట్ చేసే సినిమాలలో తళుక్కున మెరుస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో దర్శకులు నటులుగా మారి సినిమాలు చేస్తున్నారు. అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో ఫిట్ గా కనిపించడం కోసం గంటల తరబడి జిమ్ లో గడుపుతున్నాడు వినాయక్.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కోబ్రా' సినిమాతో నటుడిగా మారనున్నట్లు చెప్పారు. ఇప్పుడు మరో దర్శకుడు తేజని నటుడిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తను నిర్మిస్తోన్న ఓ సినిమాలో పాత్ర కోసం తేజని సంప్రదించాడు.

నిజజీవితంలో ఆయన పాత్రనే తెరపై కూడా పోషించనున్నారు. కథప్రకారం హీరోయిన్ ని ట్రైన్ చేసి నటనకు సిద్ధం చేసే పాత్రలో తేజ కనిపించాలి. ఇప్పటివరకు తేజ ఆన్ స్క్రీన్ కనిపించకపోయినా.. దిల్ రాజు చెప్పిన పాత్ర నచ్చడంతో నటించడానికి అంగీకరించాడు. కానీ ఇప్పుడు దిల్ రాజుకి నటించడం కుదరదని చెప్పేశాడట. దానికి కారణం తేజ భార్య శ్రీవల్లి అని తెలుస్తోంది.

తన భర్తని నటుడిగా వెండితెరపై చూడడం శ్రీవల్లికి ఇష్టం లేదట. సరైన కారణాలు చెప్పనప్పటికీ ఆమె మాత్రం తేజని నటుడిగా యాక్సెప్ట్  చేయలేనని చెప్పిందట. ఆమెని ఎంతగా కన్విన్స్ చేస్తున్నా.. తగ్గకపోవడంతో ఇక చేసేదేమీ లేక సినిమాను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది!