Asianet News TeluguAsianet News Telugu

సల్మాన్ ఖాన్ లా విలువలు ఉండే హీరోలు తెలుగులో లేరు.. మహేష్ దూకేస్తాడు.. తేజ!

దర్శకుడు తేజ కేరీర్ ఆరంభంలో ప్రేమ కథాచిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత తేజకు దాదాపు దశాబ్దకాలం కాలం పాటు హిట్స్ లేవు. 2017 నుంచి తేజ రూటు మార్చారు.

Director Teja sensational comments on telugu heros
Author
Hyderabad, First Published May 13, 2019, 8:13 AM IST

దర్శకుడు తేజ కేరీర్ ఆరంభంలో ప్రేమ కథాచిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత తేజకు దాదాపు దశాబ్దకాలం కాలం పాటు హిట్స్ లేవు. 2017 నుంచి తేజ రూటు మార్చారు. పొలిటికల్ కథాంశంతో తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దీనితో చాలా రోజుల తర్వాత తేజ విజయాన్ని అందుకున్నారు. అదే ఉత్సాహంతో ప్రస్తుతం తేజ కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో సీత చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

తాజాగా తేజ ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తేజ పరిచయం చేసిన హీరోలు ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్నారు. తనకు తాను పరాజయాల్లో ఉన్నప్పుడు వారెవరూ తనని పట్టించుకోలేదని తేజ వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే వాల్యూ అని  అన్నారు. రాజకీయనాయకులు 5 ఏళ్లకు ఒకసారి మారతారు. కానీ సినిమావాళ్లు ప్రతి శుక్రవారం మారిపోతారు అని తేజ వ్యాఖ్యానించారు. 

మన తెలుగు హీరోలకు కాస్త విలువలు తక్కువ. విజయాలు అందించిన వారిపట్ల విశ్వాసం ప్రదర్శించే హీరోలు చాలా తక్కువ. సల్మాన్ ఖాన్ కు రాజ్ శ్రీ ప్రొడక్షన్స్  సంస్థ ద్వారా బ్రేక్ వచ్చింది. సల్మాన్ ఖాన్ ఏ చిత్రానికి సంతకం చేసినా..  రాజ్ శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ పిలిస్తే వెళ్లిపోతాననే కండిషన్ పెడతారు. సల్మాన్ లా విలువలు పాటించే హీరోలు తెలుగులో చాలా తక్కువగా కనిపిస్తారు. 

 తాను హీరోలని తిట్టినా కొట్టినా సక్సెస్ ఉన్నపుడు మాత్రమే పొగుడుతారు. అదే సక్సెస్ లేకపోతే చేతకానివారిలా కారణాలు చెబుతారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అలా కాదు. ఆయనతో నిజం చిత్రం చేశా. మహేష్ దర్శకుడి నటుడు. డైరెక్టర్ దూకమన్నా మహేష్ దూకేస్తాడు. అలాంటి హీరోలు తెలుగులో కాస్త ఎక్కువగా ఉంటే బావుండేది అని తేజ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios