చిత్రం, జయం లాంటి చిత్రాలతో కెరీర్ ఆరంభంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు తేజ. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు తేజకు సరైన హిట్ లేదు. కొంత గ్యాప్ తీసుకుని రానా దగ్గుబాటితో నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. దీనితో తేజ దర్శకుడిగా కొత్త ఉత్సాహాన్ని పొందారు. 

ఈ ఏడాది తేజ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో సీత చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో తేజ తదుపరి చిత్రంతో తప్పనిసరిగా విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితి. తేజ నెక్స్ట్ మూవీపై ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తేజ తన నెక్స్ట్ మూవీ ఏ జోనర్ లో ఉండబోతోందో వివరించారు. 

ప్రస్తుతం తాను ఓ మల్టీస్టారర్ చిత్రానికి కథ సిద్ధం చేసుకుంటున్నట్లు తేజ తెలిపారు. కథ పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా సాగేలా స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తేజ తెలిపారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలకు మంచి డిమాండ్ నెలకొని ఉంది.