డైరెక్టర్ గా తేజ ఆ మధ్యన పూర్తిగా వెనకబడ్డారు. ఒక్కటంటే ఒక్కటీ హిట్ రానీ పరిస్దితి ఏర్పడింది. దాన్ని బ్రేక్ చేస్తూ దాదాపు  దశాబ్దంన్నర తర్వాత నేనే రాజు నేనే మంత్రి తో హిట్ కొట్టి హమ్మయ్య అనిపించుకున్నాడు.  కానీ ఆ ఉత్సాహం ఎక్కువ సేపు లేదు. ఆ సినిమా తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన సీత తో మళ్లీ బ్యాక్ టూ డీ-ఫామ్ అన్నట్టు అయ్యిపోయింది పరిస్దితి.

సీత డిజాస్టర్ అవ్వడంతో తేజ తో సినిమా చేయడానికి ఏ హీరో ఉత్సాహం చూపటం లేదు. దాంతో తన వల్ల కెరీర్ లో కాస్త కలిసొచ్చిన హీరోలనే కలిస్తే బెస్ట్ అని చేసిన పని కలిసొచ్చింది. ఓ హీరో ఆయనకు డేట్స్ ఇవ్వటానికి ముందుకొచ్చాడు.  అయితే ఆ హీరోను దాదాపు అదే పరిస్దితి ఎదుర్కొంటున్నాడు. కానీ తేజ తనను తిరిగి ఫామ్ లోకి తీసుకొస్తాడని నమ్ముతున్నాడు.

అవును తేజ ద‌ర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేయ‌బోతున్నాడనే తెలుస్తోంది.  గోపీచంద్-తేజ ఇద్దరు ప్లాప్ ల్లోనే ఉండటమే ట్రేడ్ కు ఇబ్బందికర పరిస్దితి. అయితే ఈ సమస్య ని ఎదుర్కోవటానికి అవుట్ అండ్ అవుట్...  ఓ యాక్షన్ సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారుట‌. ఇప్పటికే స్టోరీ లాక్ చేసి, పూర్తి స్క్రిప్టు రెడీ చేసే పనిలో పడినట్లు చెప్తున్నారు. గోపిచంద్ ప్రస్తుతం ‘చాణక్య’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా తరువాత తేజ సినిమా చేయనున్నాడు గోపిచంద్.

వరస ఫ్లాప్ లో ఉన్న తేజ కి గోపిచంద్ ఛాన్స్ ఇవ్వటం వెనక పెద్ద లాజిక్ లు కారణాలు ఏమీ లేవని, తేజ విషయంలో గోపీలో కృతజ్ఞతా భావం ఉండటమే కారణం అంటున్నారు. గోపీచంద్ మొదటి సినిమా ‘తొలి వలపు’తో హీరోగా డిజాస్టర్ ఫలితం అందుకుని డీలా పడిన టైమ్ లో ...  అతడిని విలన్ గా మార్చి జయం తో సక్సెస్ అందించాడు. గోపీచంద్ కి ఆ సినిమాతో హీరోతో సమానంగా పెద్ద పేరు వచ్చింది. వరసగా విలన్ గా రెండుమూడు సినిమాలు చేసిన తరువాత ‘యజ్ఞం’ తో మళ్లీ హీరోగా మారి కెరీర్ ని కొనసాగించారు.