అవకాశం వస్తే ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలడని శర్వానంద్ కి ఇప్పటికే ఒక మంచి గుర్తింపు దక్కింది. చివరగా ఈ యువ హీరో చేసిన పడి పడి లేచే మనసు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని డిఫరెంట్ గా గ్యాంగ్ స్టర్ సినిమాతో వస్తున్నాడు. 

శర్వా కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి డిఫరెంట్ జానర్ ని టచ్ చేస్తున్నాడు. స్వామి రారా - కేశవ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే సినిమా హిట్టయితే సీక్వెల్ కూడా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. 

సినిమా ఎండింగ్ సమయంలో కథానాయకుడు శర్వానంద్ తనకు ఒక మంచి ఐడియా ఇచ్చాడని చెప్పిన దర్శకుడు సీక్వెల్ రావాలంటే ముందు రణరంగం సినిమా హిట్టవ్వాలని..ఈ సినిమా హిట్టయితేనే తప్పకుండా సీక్వెల్ ను తెరకెక్కించే అవకాశం ఉంటుందని అన్నారు. ఇక నెక్స్ట్ కూడా సీతారా ఎంటర్టైన్మెంట్స్ లోనే ఒక సినిమా చేయాలనీ నిర్మాత నాగవంశీ కోరినట్లు దర్శకుడు సుధీర్ వివరణ ఇచ్చాడు.