కరోన మహమ్మారి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని వణికిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సహా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌, దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి కూడా తమ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈమేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు.

`కొద్ది రోజుల క్రితం మా కుటుంబ సభ్యులకు కొద్ది పాటి జ్వరం వచ్చింది. దానంతట అదే తగ్గిపోయింది. కానీ ఈ రోజు కొద్ది కోవిడ్ పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. మేం డాక్టర్ల సూచనల మేరకు ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో ఉన్నాం. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవు. అందరం ఆరోగ్యంగా ఉన్నాం. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం యాంటీ బాడీస్‌ డెవలప్‌ చేసుకుంటున్నాం. ప్లాస్మా డోనేట్‌ చేస్తాం` అంటూ కామెంట్ చేశాడు రాజమౌళి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SS Rajamouli (@ssrajamouli) on Jul 29, 2020 at 8:21am PDT

 

రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత మరోసారి అదే స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నా ఈ సినిమా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ఫాంటసీ కధాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీంగా, రామ్ చరణ్‌ అల్లూరి సీతారామ రాజుగా కనిపింంచనున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి కాగా కరోనా కారణంగా నాలుగు నెలలుగా షూటింగ్‌కు బ్రేక్‌ పడింది.