మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’(RRR) ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్ణాటకలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈసందర్భంగా ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడారు. ఈవెంట్ విచ్చేసిన అతిథుల నుంచి, మూవీకోసం పనిచేసిన ప్రతిఒక్కరి గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి అంటూ స్పష్టం చేశారు.
మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’(RRR) ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్ణాటకలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ లో ఆర్ఆర్ఆర్ దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ కర్ణాటక ఆడియన్స్ కు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. మా చిత్రాన్ని ఆశీర్వదించేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన కర్ణాటక సీఎం బస్వరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే హెల్త్ మినిస్టర్ డాక్టర్ కే సుధాకర్ కు కూడా క్రుతజ్ఞతలు తెలిపారు. చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యకు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) ఈవెంట్ లో ఉండటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించలేదని, ఆయన మన మధ్యే జీవించి ఉన్నాడని తెలిపారు. ఇందుకు కారణం ఇటీవల అప్పు మూవీ ‘జేమ్స్’ రిలీజ్ అయి హిట్ కొట్టడమే అని అన్నారు. ఒకే వేదికపై కన్నడ స్టార్ శివరాజ్ కుమార్.. ఇటు తెలుగు స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండటం తెలుగు, కర్ణాటక ప్రజల సంగమాన్ని చూస్తున్నానని, ఇదంతా చూస్తుంటే తనకు శ్రీ క్రిష్ణదేవరాయ విజయనగరం సామ్రాజ్యం ఇలాగే ఉందమోనని భావిస్తున్నానన్నారు. ఈ మైత్రి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
అనంతరం మూవీ కోసం పనిచేసిన టెక్నీషియన్ల గురించి రాజమౌళి ప్రత్యేకంగా మాట్లాడారు. వీళ్లు సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారని తెలిపారు. ముఖ్యంగా కో డైరెక్టర్ కోఠి గురించి మాట్లాడుతూ అతని దగ్గరే నేను పనిచేశానని, నేను డైరెక్టర్ అయ్యాక కోఠి తనదగ్గరికి వచ్చాడని తెలిపారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీను గురించి మాట్లాడుతూ తన మొదటి శాంతినివాసం సీరియల్ నుంచి తనను విడిచిపెట్టిపోలేదన్నారు. ఇలా ఇంకొద్దరూ టెక్నీషియన్ల గురించి మాట్లాడారు. ప్రధానంగా విజువల్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఆర్ఆర్ఆర్ కు మరింత క్రేజ్ తెచ్చారన్నారు. ఇందుకు ప్రొడక్షన్ డిజైనర్ సాహు సిరిల్, డీవోపీ సింథిల్, విజువల్ ఎఫెక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్, రమ పక్కా ప్లానింగ్ తో పనిచేయడంతోనే విజువల్స్ ను బాగా చూపించడం జరిగిందన్నారు.
అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ సినిమా రేట్లపై వెంటనే స్పందించారన్నారు. ఇందుకు ఆయన ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. అలాగే ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడుతూ తమ సినిమా గురించి తెలపగానే.. అర్థం చేసుకొని ఆడియెన్స్ ను, సినిమా నిర్మాతలను గుర్తుంచుకొని రేట్లు ఫిక్స్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే, ఏపీ టికెట్ల ఇష్యూపై ఇండస్ట్రీ నుంచి ఒక్కరు వచ్చారని, ఆయనే మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన్ని ఎందరో ఎన్నో మాటలు అన్నా.. మమ్మల్ని గెలిపించేందుకు ఆయన తగ్గారని తెలిపారు. చిరంజీవి నిజమైన మెగాస్టార్ అని, ఆయనే ఇండస్ట్రీకి పెద్దగా నేను భావిస్తున్నానని తెలిపారు.
అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ సినిమా గురించి వీరిని సంప్రదించినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా నాకు కావాల్సింది ఇచ్చారని తెలిపారు. ముఖ్యంగా రామ్ చరణ్ గొప్పతనం ఆయనకు తెలియడం లేదు. ఆయన గొప్పతనాన్ని, ఆయనకున్న ఫాలోయింగ్ ను ప్రతిసారి మేమే చెప్పాల్సి వస్తోందన్నారు. అలాగే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ కు ఆ పేరుపెట్డడం పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఆయన పొటెన్షియల్ ఎంతనో ఆయనకు తెలియడం నిజంగా గొప్ప విషయం. వీరిద్దరూ నా సినిమాలో పనిచేయడం ఎంతో అద్రుష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందు రానుంది.
