Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ గురించి నేను మాట్లాడలేదు, పుకారు పుట్టించారు.. డైరెక్టర్ వశిష్ట క్లారిటీ..

డైరెక్టర్ వశిష్ట ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రామ్ చరణ్ సినిమాగురించి తాను అనని మాటలను కూడా అన్నట్టు క్రియేట్ చేశారంటూ.. క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే..? 

Director Sri Vasishta Comments On Ram Charan Movie JMS
Author
First Published Jan 17, 2024, 10:57 PM IST

కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమాతో సూపర్ హిట్ అవ్వడంతో.. ఒక్క సారిగా టాలీవుడ్ దృష్టిని ఆకర్శించారు యంగ్ డైరెక్టర్ వశిష్ట.  హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో.. డైరెక్టర్ గా తనను తాను మలుచుకున్నాడు వశిష్ట. సోషియోఫ్యాంటసీ కథతో బింబిసారను తెరకెక్కించి  భారీ విజయాన్ని అందుకున్న శ్రీ వశిష్ఠ, ఆ సినిమాతో చాలామంది స్టార్ హీరోల చూపును తనవైపు తిప్పుకున్నాడు. 

ఫాంటసీ నేపథ్యంలో చాలా కథలు వశిష్ట దగ్గర ఉన్నాయి. అయితే బింబిసార సినిమాను వశిష్ట డ్రైవ్ చేసిన విధానం చాలామంది హీరోలకు నచ్చింది. దాంతో అతనికి వరుస ఆఫర్లు ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వశిఫ్టకు సినిమా ఆఫర్ ఇవ్వడం.. వశిష్ట ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈక్రమంలో ఈయంగ్ డైరెక్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

తాజా ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ ..  చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చాడు. బింబిసార' సినిమాతో కల్యాణ్ రామ్ అవకాశం ఇవ్వడం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. కాకపోతే సీక్వెల్ మాత్రం నేను చేయడం లేదు అన్నారు. బింబిసార 2' విషయానికి వచ్చేసరికి నా ఐడియాలజీ వేరేగా ఉంది. అంతలో నాకు మెగా స్టార్ ప్రాజెక్టు చేసే ఛాన్స్ కూడా వచ్చింది అన్నారు. 

Director Sri Vasishta Comments On Ram Charan Movie JMS

అయితే బింబిసార సీక్వెల్ విషయంలో నాకు కల్యాణ్ రామ్ గారికి మధ్య గ్యాప్ వచ్చింది అని చాలా మంది ప్రచారం చేశారు.. కాని నాకు మెగా ప్రాజెక్ట్ రావడంతో..  నేను కల్యాణ్ రామ్ గారి అనుమతి తీసుకునే బయటికి వచ్చాను. అంతే తప్ప మా మధ్య ఎలాంటి సమస్య రాలేదు అన్నారు. ఇక  తను మాట్లాడిన మాటలు చాలామంది వక్రీకరిస్తున్నారన్నారు వశిష్ట.చిరంజీవిగారితో ఫాంటసీ మూవీ చేయాలని ఉందంటే, దానిని తమకు అనుగూణంగా మార్చి.. వేరేగా రాశారు" అని అన్నాడు. 

ఇక రామ్ చరణ్ విషయంలో కూడా తాను అనని విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది అన్నారు వశిషప్ట. చరణ్ తో నేను 'బాహుబలి' లాంటి సినిమా చేస్తానని అన్నట్టుగా కూడా చాలామంది రాసుకొచ్చారు. కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా ఆ మాట అనలేదు. కావాలని చెప్పి కొంతమంది అలా పుకారు పుట్టించారంతే. మొదటి నుంచి కూడా నాకు ఫాంటసీ కంటెంట్ అంటే ఇష్టం. అందువల్లనే అలాంటి కథతోనే సెట్స్ పైకి వెళ్లాను అని మబ్బులు విడిపోయేలా.. క్లారిటీ ఇచ్చాడు యంగ్ డైరెక్టర్.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios