ఇండియన్ 2 కంప్లీట్ చేసిన శంకర్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పరిస్థితేంటి..?
ఎట్టకేలకు కమల్ హాసన్ తో ఇండియన్2 మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు స్టార్ డైరెక్టర్ శంకర్. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంగతి ఎంత వరకూ వచ్చింది. అప్ డేట్ ఏంటి..?

టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈమూవీ నుంచి అప్డేట్స్ కోసం ఎంతగానో చూస్తున్నారు ఫ్యాన్స్. చరణ్ మాత్రం పాప పుట్టిందని కొన్ని నెలల పాటు సినిమాకు బ్రేక్ ఇచ్చాడు. దాంతో ఇదే ఛాన్స్ అని డైరెక్టర్ శంకర్(Director Shankar)కమల్ హాసన్ తో ఇండియన్ 2 ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయడానికి చెన్నై చెక్కేశారు. అంతకు ముందు ఈ రెండు సినిమాలు సైమల్ టైనిస్ గా చేసుకుంటూ వచ్చిన శంకర్.. ఆతరువాత కమల్ సినిమాపై కంప్లీట్ గా దృష్టి పెట్టాడు. ఇక తాజాగా శంకర్ ఈమూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక అక్కడ తమిళ మీడియా చెపుతున్న కథనాల ప్రకారం శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసేశారట. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. మరి మా చరణ్ పరిస్థితి ఏంటి అని ఎదురుచూస్తున్న అభిమానులకు కూడా శంకర్ ఓ గుడ్ న్యూస్ ను అందించబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం నుండి హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు సమాచారం.
రామ్ చరణ్ కూడా షూటింగ్ కు రెడీగా ఉన్నాట. శంకర్ కొన్ని రోజుల్లో హైదరాబాద్ కి రానున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఈ విషయం ప్రస్తుతం రూమర్ గానే ఉంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. త్వరలో షూట్ స్టార్ట్ అవ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ తరువాత.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈమూవీ కూడా పార్ ఇండియా మూవీగా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కూడా సాధించాడు.