కన్నడ నాట స్టార్ హీరో కిచ్చా సుధీప్ రాజకీయ ప్రకంపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనను బెదిరించిన కేసులో ఒక దర్శకుడిని అరెస్ట్ చేశారు పోలీసలు

కన్నడ నాట స్టార్ హీరో కిచ్చా సుధీప్ రాజకీయ ప్రకంపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనను బెదిరించిన కేసులో ఒక దర్శకుడిని అరెస్ట్ చేశారు పోలీసలు 

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు కిచ్చా సుదీప్. గతంలో హిందీ భాషగురించి బాలీవుడ్ స్టార్స్ తో ట్విట్టర్ వార్ నడిపాంచారు సుధీప్. ఇక తాజాగా కన్నడ నాట తన మద్దతు బీజేపీకి ప్రకటించి హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఆయనకు బెదిరింపులు రావడం.. వారెవరో తెలుసుకుని అరెస్ట్ చేయడం ఇలా కార్నాటకలో చిత్ర విచిత్ర ఫిల్మ్ పాలిటిక్స్ జరుగుతన్నాయి. ఇంతకీ అసలేమయ్యింది. 

కిచ్చా సుధీప్..కన్నడ నాట స్టార్ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ ఇలా ఆయన మల్టీ టాలెంట్ చూపించి స్టార్ గా వెలుగు వెలుగుతున్నారు. ఇటు తెలుగులో కూడా ఈగ సుధీప్ గా ఆయనకు మంచి పేరు ఉంది. విక్రాంత్ రోణా సినిమాతో పాన్ ఇండియాకు ఆయన టాలెంట్ తెలిసిపోయింది. ఇక తాజాగా ఆయనకు ఆమధ్య ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ విషయంలో కంప్లైట్ రేజ్ అవ్వగా.. ఆ లేఖ పంపింది ప్రముఖ దర్శకుడని.. ఆయన కూడా సుధీప్ కు బాగా తెలిసిన వారని సమాచారం. 

సుదీప్ క్లోజ్ ఫ్రెండ్, డైరెక్టర్ రమేష్ కిట్టి ఈ పని చేసినట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరూ కలిసి సుదీప్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. డైరెక్ట్ రమేష్, దీనికి ప్రెసిడెంట్. అయితే ట్రస్ట్ ఫండ్స్ విషయంలో సుదీప్-రమేష్ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రెసిటెంట్, డైరెక్టర్ రమేష్ కిట్టీ.. ట్రస్టులో 2 కోట్లు పెట్టగా, ఆ డబ్బు విషయంలో సుదీప్ మోసం చేశాడని అంటున్నారు. 

ఇక అందుకే సుధీప్ ను బెదిరిస్తూ.. సదరు డైరెక్టర్ రమేష్ లెటర్స్ పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో రమేష్ తోపాటు పలువురు హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా సుదీప్ బెదిరింపుల కేసు వ్యవహారం రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. చివరకు ఏం తేలుతుందనేది చూడాలి. ఇక అటు రాజకీయంగా కూడా సుధీప్ పై పలు విమర్షలు వస్తున్నాయి. ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించడం పట్ల..ప్రకాశ్ రాజ్ లాంటివారు స్పందించారు.