వర్మ తన కాంపౌండ్ హీరోయిన్ బికినీ ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటో పై ఓ క్రేజీ కామెంట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ పోస్ట్ వైరల్ గా మారగా... ఎప్పటిలాగే ఫాన్స్, యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గత రెండేళ్లుగా వర్మ కాంపౌండ్ లో పని చేస్తుంది హీరోయిన్ అప్సరా రాణి. ఈమె అసలు పేరు అంకిత మహారాణా. వర్మ అప్సరా రాణిగా నామకరణం చేశాడు. తన సినిమాలలో అవకాశాలు ఇస్తున్నాడు. అలాగే తన పలుకుబడితో ఇతర హీరోల చిత్రాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్స్ ఇప్పిస్తున్నాడు. 4 లెటర్స్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన అప్సర, తర్వాత ఊల్లాల ఊల్లాల చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి నటుడు సత్య ప్రకాష్ దర్శకత్వం వహించారు.
ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న అప్సర రాణికి రామ్ గోపాల్ వర్మ థ్రిల్లర్ మూవీలో అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన డి కంపెనీ, డేంజరస్ చిత్రాల్లో అప్సర రాణి నటించడం జరిగింది. డేంజరస్ ఇటీవలే విడుదల కాగా అనేక సమస్యలు ఎదుర్కొంది. ఈ మూవీలో నైనా గంగూలీ మరో హీరోయిన్ గా చేశారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నడిచే ప్రేమకథగా లెస్బియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కొన్ని థియేటర్ యాజమాన్యాలు డేంజరస్ చిత్ర ప్రదర్శనకు నిరాకరించాయి. అలాగే నట్టి కుమార్ దర్శకుడు వర్మ నాకు డబ్బులు చెల్లించాల్సి ఉంది, డేంజరస్ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ కోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చారు.
ఎట్టకేలకు ఆ సినిమా విడుదలైంది. ఇక వర్మ తరచుగా అప్సరా రాణితో ప్రైవేట్ పార్టీలు జరుపుకుంటూ ఉంటారు. సదరు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక వర్మ రాజభోగాలకు జనాలు కుళ్ళుకుంటూ ఉంటారు. తాజాగా వర్మ అప్సరా రాణి బికినీ ఫోటో షేర్ చేశారు. ఇక ఆ ఫోటోకి ఓ అద్భుతమైన కామెంట్ జత చేశారు. నేను జీవితంలో చూసిన డేరింగ్ ఫోజు ఇదేనంటూ కామెంట్ పెట్టాడు. రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.
