యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఊహించని క్రేజ్ నడుమ రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. 

రాధే శ్యామ్ క్లైమాక్స్ పై ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. విజయం ప్రేమదా ? విధిదా ? అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ రాధే శ్యామ్ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రీ సేల్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి ఏరియాలో టికెట్స్ అమ్ముడైపోతుండడం చిత్ర యూనిట్ కి జోష్ ఇచ్చే అంశం. 

ఇదిలా ఉండగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమా గురించి ఇంటరెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేస్తున్నారు. తాజాగా రాధాకృష్ణ సోషల్ మీడియా వేదికగా బుక్ మై షో కి రిక్వస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. బుక్ మై షోలో రాధే శ్యామ్ చిత్రానికి సంబంధించిన పోస్టర్ మంచిది లేదు. ప్రభాస్, పూజా హెగ్డే సరిగా కనిపించని పోస్టర్ పెట్టారు. 

దీనితో ఆ పోస్టర్ చేంజ్ చేయాలని రాధాకృష్ణ బుక్ మై షోని కోరుతూ ట్వీట్ చేశారు. రాధే శ్యామ్ చిత్రం విషయంలో రాధా కృష్ణ ఎంత కేరింగ్ ఉంటున్నారో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. దాదాపు 300 కోట్లపైగా బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా నటిస్తున్నాడు. చేతి గీతాల్ని చూసి భవిష్యత్తు చెప్పే పాత్ర ఇది. అలాంటి వ్యక్తి జీవితాన్ని ప్రేమ ఎలాంటి మలుపులు తిప్పింది అనేది ఈ చిత్రంలో ఆసక్తికర అంశం.

Scroll to load tweet…