Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు కొరటాల..ఇప్పుడు ప్రశాంత్ నీల్ ,ఎందుకీ దారుణ నిర్ణయం?ఏం జరుగుతోంది

అయితే ప్రశాంత్ నీల్ ఇలాంటి నిర్ణయం ఇంత అకస్మాత్తుగా ఎందుకు తీసుకున్నారో ఎవరికి అర్దం కాలేదు. ఆయన ఎక్కౌంట్ ద్వారా సలార్ సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూండేవి. 

Director #PrashanthNeel Decided to stay away from Twitter
Author
First Published Jan 10, 2023, 6:16 AM IST


ప్రస్తుతం అన్ని వృత్తుల్లోనూ  సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది.సోషల్ మీడియాతో సెలబ్రెటీలు సైతం అందరికీ అందుబాటులో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో  సోషల్ మీడియా అకౌంట్ లేని వారెవ్వరూ వుండరనేది నిజం. ఇక సినీ స్టార్స్ అయితే సోషల్ మీడియాను తెగ వాడేస్తుంటారు. శంఖం లో పోస్తేగాని తీర్ధమ్ కాదన్నట్లు ట్విట్టర్, పేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ లు  తమ వార్తలు అధికారికం కావని సెలెబ్రిటీలు భావించే స్దితికి వచ్చేసారు.  టాలీవుడ్ సెలబ్రెటీలలో సోషల్ మీడియా ఖాతాలు లేని వారెవ్వరూ ఉండరు. 

 రామ్ గోపాల్ వర్మ వంటి కొందరు సెలెబ్రిటీలు నిత్యం అదే ప్రపంచంగా బతికేస్తుంటారు. కొందరు మాత్రం సోషల్ మీడియా నెగెటివిటీని తట్టుకోలేక అక్కడి నుంచి దూరంగా వెళ్తుంటారు. ఆ మధ్యన దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియా నుంచి బయటకు వెళ్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు కొరటాల బాటలోనే మరో దర్శకుడు ప్రయాణం పెట్టుకున్నారు. ఆయన మరెవరో కాదు కెజీఎఫ్ చిత్రాలతో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న ప్రశాంత్ నీల్. ఆయన తన ట్విట్టర్ ఎక్కౌంట్ ని క్లోజ్ చేసేసారు.

అయితే ప్రశాంత్ నీల్ ఇలాంటి నిర్ణయం ఇంత అకస్మాత్తుగా ఎందుకు తీసుకున్నారో ఎవరికి అర్దం కాలేదు. ఆయన ఎక్కౌంట్ ద్వారా సలార్ సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూండేవి. అయితే మాస్ ట్యాగింగ్ లు, ఫ్యాన్స్ నుంచి ఆబ్లిగేషన్స్ ఆయన్ను చాలా ఒత్తిడికి గురి చేసాయని, అందుకే ట్విట్టర్ కు బై చెప్పారని చెప్పుకుంటున్నారు. ఏదైమైనా ఇలా స్టార్ డైరక్టర్స్ సోషల్ మీడియాకు బై చెప్పటం అందరినీ ఆలోచనలో పడేస్తున్న విషయమే.

ఇక ఆచార్య రిలీజ్ కు ముందే కొరటాల ట్విట్టర్ నుంచి తప్పుకున్నారు. అంతకు ముందు కొరటాల శివకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ వంటి వాటిలో యాక్టివ్‌గానే ఉండేవారు. అయితే సినిమా అప్డేట్లు, పండుగలకు స్పెషల్ పోస్ట్‌లు వేసేవారు. అలాంటి కొరటాల ట్విట్టర్ నుంచి లెప్ట్ అవతూ పెట్టిన   పోస్ట్ అప్పట్లో  అందరినీ ఆశ్చర్యపరిచింది. కారణాలు ఏమీ చెప్పలేదు కానీ చివరి సందేశాన్ని ఇచ్చారు. హలో.. నేను సోషల్ మీడియా నుంచి దూరంగా వెళ్తున్నాను అని మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంత వరకు నా అభిప్రాయాలు పంచుకున్నాను. అయితే ఇప్పుడు మాత్రం వెళ్లిపోయే సమయం వచ్చింది. మీడియా స్నేహితుల్లా ద్వారా మీతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాను. నేను మీతో మాట్లాడే మీడియం చేంజ్ కావొచ్చు కానీ మన మధ్య ఉన్న బంధం మాత్రం మారదు అని కొరటాల శివ తన చివరి సందేశాన్ని ఇచ్చారు.  ప్రశాంత్ నీల్ ఆ పని కూడా చేయలేదు. సైలెంట్ గా ట్విట్టర్ ఎక్కౌంట్ ని క్లోజ్ చేసేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios