Asianet News TeluguAsianet News Telugu

మరో సంచలన ప్రాజెక్ట్ ప్రకటించిన ప్రశాంత్ వర్మ.. ఈ సారి సూపర్ హీరోతో వస్తున్నాడు!

ప్రశాంత్ వర్మ హను మాన్ అనే ఓ సూపర్ హీరో మూవీ ప్రకటించారు. హిమాలయాల్లో సుదూరంగా ఉన్న ఓ వ్యక్తితో కూడిన ప్రకటన పోస్టర్ విడుదల చేశారు. హను మాన్ టైటిల్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది.

director prashanth varma announces another exciting project on his birthday ksr
Author
Hyderabad, First Published May 29, 2021, 1:42 PM IST

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో భిన్నమైన సబ్జెక్టుతో మన ముందుకు రానున్నారు. ఆయన ఈసారి సూపర్ హీరో కాన్సెప్ట్ ఎంచుకున్నారు. బర్త్ డే పురస్కరించుకుని తన నాలుగవ చిత్ర టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. కెరీర్ బిగినింగ్ నుండి వినూత్న సబ్జక్ట్స్ తో సినిమాలు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ మొదటి చిత్రం 'అ'. కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. జాతీయ స్థాయిలో అవార్డ్స్ గెలుచుకుంది 'అ' మూవీ. 


ఆ తరువాత సీనియర్ హీరో రాజశేఖర్ తో కల్కి చిత్రం చేశారు. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే ప్రశాంత్ వర్మ గత చిత్రం జాంబి రెడ్డి సూపర్ హిట్ కొట్టింది. జాంబీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తొలి తెలుగు చిత్రం జాంబీ రెడ్డి కాగా, ఈ మూవీ ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. లాక్ డౌన్ తరువాత థియేటర్స్ కి ప్రేక్షకుల రప్పించిన చిత్రాలలో జాంబీ రెడ్డి కూడా ఉంది. 


తాజాగా ఆయన హను మాన్ అనే ఓ సూపర్ హీరో మూవీ ప్రకటించారు. హిమాలయాల్లో సుదూరంగా ఉన్న ఓ వ్యక్తితో కూడిన ప్రకటన పోస్టర్ విడుదల చేశారు. హను మాన్ టైటిల్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. కాగా ఈ చిత్రంలోని నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సూపర్ హీరో మూవీ అంటే భారీ బడ్జెట్ అవసరం అవుతుంది. మరి హను మాన్ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios