కెజియఫ్ సినిమాలతో ఒక్క సారిగా పాపులర్ అయిన తెలుగు కుర్రాడు ప్రశాంత్ నీల్ హార్ట్ అయ్యాడు. సోషల్ మీడియాకు దూరం అయ్యాడు. ఇంతకీ ప్రశాంత్ నీల్ ఎందుకు హార్ట్ అయ్యారు..? కారణం ఏంటి..?
కేజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సాధించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈసినిమాలతో హీరో యష్ కంటే ఎక్కువగా ప్రశాంత్ నీల్ కే పేరు వచ్చింది. క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్ నీల్. ఇక వెంటనే వారుస సినిమాలు ఆయన గుమ్మం ముందుకు ఆఫర్ల రూపంలో వచ్చిపడ్డాయి. దాంతో ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారా అని అంతా ఎదరు చూశారు. ఈ క్రమంలో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా అనౌన్స్ చేశారు ప్రశాంత్. అయితే ఈ విషయంలో కన్నడ ఆడియన్స్ కాస్త హర్ట్ అయ్యారట. కన్నడ సినిమాతో హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్..వెంటనే తెలుగు హీరోతో సినిమ చేయడం ఏంటీ..? కన్నడాలో తాను సినిమా చేయదగ్గ హీరో లేడా అంటూ అప్పట్లో ట్రోల్ చేశారు కూడా.
అయితే ఇది నడుస్తుండగానే నెక్ట్స్ సినిమా అయినా మళ్ళీ కన్నడ హీరోతో చేస్తాడు..లేదా కెజియఫ్ పార్ట్ 3 అనౌన్స్ చేస్తాడు అనుకుంటే.. వెంటనే ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాడు ప్రశాంత్ నీల్. దాంతో కన్నడ ఫ్యాన్స్ గట్టిగా కోపం వచ్చేసింది. రాజమౌళి లాంటి దర్శకులు బాహుబలితో అంత ఇమేజ్ సాధించినా... నెక్ట్స్ సినిమా ఆయన తెలుగు హీరోలతోనే చేస్తున్నాడు. టాలీవుడ్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు.. కాని కన్నడ హీరోలను వదిలేసి.. ప్రశాంత్ నీల్ పక్క భాష హీరోలతో సినిమాలు.. అది కూడా పాన్ ఇండియాసినిమాలేంటి అంటూ.. చెవులు కోరుక్కున్నారు కన్నడ ఫ్యాన్స్.
ఆతరువాత ఈ సోషల్ మీడియా డిస్కర్షన్లు కొంత కాలానికి ఆగాయి..ఇక అయిపోయిందిలే అనుకున్నటైమ్ కు..ఈచర్చ మళ్ళీ మొదలయ్యింది. ఈమధ్య యశ్ పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ చర్చ వచ్చింది. కేజీయఫ్ 3 సినిమా అప్‌డేట్స్ కావాలంటే యశ్ ఫ్యాన్స్, కన్నడ ప్రేక్షకులు ప్రశాంత్ నీల్‌కు వరుసగా ట్విటర్‌లో మెసేజ్‌లు చేశారు. ఈ క్రమంలో కొంత మంది నెటిజన్లు కాస్త దురుసు కామెంట్లు చేశారు. దాంతో ప్రశాంత్ నీల్ ఇవన్నీ చూసి బాధపడ్డట్టుతెలుస్తోంది. దాంతో వెంటనే ఏకంగా తన ట్విటర్ అకౌంట్ క్లోజ్ చేసేశారని సమాచారం.
ఇలా హీరోల మీద అభిమానం ఉండొచ్చు కాని.. అది దర్శకులను.. ఇతరులను బాధపెట్టేదిగా ఉండకూడదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆమధ్య ఆచార్య ఫెయిల్యూర్ తరువాత కొరటాల కూడా ఇదే బాధను అనుభవించారు. ఆయన కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ను క్లో్ చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ప్రశాంత్ నీల్ కు వచ్చింది. అవ్వడానికి కన్నడ దర్శకుడే అయినా.. తెలుగు ఫ్యామిలీకి చెందిన వ్యాక్తే.. ప్రశాంత్ నీల్.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ బిజీ బిజీగా ఉన్నాడు సలార్ షూటింగ్ ఆల్ మోస్ట్ అయిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి పెట్టారు. అటు ఎన్టీఆర్ సినిమాకు సబంధించి పని కూడా కంప్లీట్ అయ్యింది. కొరటాల మూవీ స్టార్ట్ అయిన కొన్ని నెలల లోపే ప్రశాంత్ నీల్ సినిమా కూడా స్టార్ట్ చేద్దాం అని చూస్తున్నాడు తారక్. సలర్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోగానే ఇదిస్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
