రైల్వే మంత్రికి స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సినిమాలు చేసుకునే  నాగ్ అశ్వీన్.. సెంట్రల్ మినిష్టర్ కు.. అది కూడా రైల్వే మినిష్టర్ కు ఏం  రిక్వెస్ట్ పెట్టుకున్నారు అని అందరికి డౌట్ రావచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ గురించి.. నాగ్ అశ్వీన్ మంత్రికి విన్నపం చేశారు. 


తిరుపతి రైల్వే స్టేషన్ విషయంలో బాధ్యతగా వ్యవహరించారు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. తనకు అనిపించిన విషయాన్ని.. ప్రజలు అనుకుంటున్న అభిప్రాయాన్ని రైల్వే మంత్రికి అర్ధం అయ్యేలా ట్వీట్ చేశారు. ఆయనకు అర్ధం అయ్యేలా తన భాషలో ఓ ఉదాహరణ కూడా చెప్పారు నాగ్ అశ్వీన్. 

తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి తరలి వస్తుంటారు. ఈ క్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటుంది. ఈ రద్దీని తట్టుకునేలా తిరుపతి రైల్వే స్టేషన్ ను భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయబోతోంది.

ఈ క్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్ ఫొటోలను రైల్వే శాఖ నిన్న విడుదల చేసింది. ఈ ఫొటోలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పనులకు సంబంధించి కాంట్రాక్టులను కూడా ఇచ్చేశామని... త్వరలోనే పనులు స్టార్ట్ అవుతాయని ఆయన చెప్పారు. 

అయితే, రైల్వే శాఖ విడుదల చేసిన డిజైన్లపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. భవనం డిజైన్ సాదాసీదాగా ఉందని, ఒక ఐటీ ఆఫీస్ మాధిరగా బిల్డింగ్ ఉందని జనాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుంది. భవనం డిజైన్ మన సంస్కృతికి దగ్గరగా లేదని, పుణ్యక్షేత్రాన్ని ప్రతిబింబించేలా లేదని విమర్శిస్తున్నారు. తిరుమల, తిరుపతి ఆధ్యాత్మికత డిజైన్ లో కనిపించడం లేదని విమర్షలతో పాటు వ్యాతిరేకత కూడా స్టార్ట్ అయ్యింది. 

Scroll to load tweet…

ఈ నేపథ్యంలోనే ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. డియర్ సర్. మీరు ప్రతిపాదించిన తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్ ను ఎవరూ ఇష్టపడటం లేదు. ప్రజల నుంచి వస్తున్న కామెంట్లను మీరు కూడా చూసే ఉంటారు. వెస్టర్న్ డిజైన్ ను కాపీ చేసినట్టుగా, ఒక చెత్త ఐటీ పార్క్ మాదిరిగా ఉంది. తిరుపతి చాలా పవిత్రమైనది, ఆధ్యాత్మికతతో కూడినది. అత్యున్నతమైనటువంటి మన భారతీయ ఆర్కిటెక్చర్ పై పట్టున్న వ్యక్తుల చేత డిజైన్ చేయించండి. గ్లాస్, స్టీల్ తో కూడిన భవనాలను కాపీ కొట్టొద్దు అని రైల్వే మంత్రికి సూచించారు.

ఈ విషయంలో రైల్వే మంత్రి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కాని కామన్ పీపుల్ నుంచి మాత్రం నాగ్ అశ్విన్ కు సపోర్ట్ లభిస్తుంది. ఇక ఈ విషయంలో రైల్వే నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక నాగ్ అశ్వీన్ ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్ కాస్ట్.. దీపికా పదుకొనే. అమితాబ్ లాటి స్టార్స్ కలిసి నటిస్తున్న ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.