ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మారుతీ ఇంట విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతూ మరుతి తండ్రి కుచలరావు ఈరోజు ఉదయ కన్ను మూవారు.  

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మారుతీ ఇంట విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతూ మరుతి తండ్రి కుచలరావు ఈరోజు ఉదయ కన్ను మూవారు. 

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతి ఇంట విషాదం నెలకొంది. మారుతి తండ్రి కుచలరావు మరణించారు. 76 సంవత్సరాల వయస్సులో కుచలరావు అనారోగ్యంతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుచలరావు నిన్న అర్ధరాత్రి మచిలీపట్టణంలోని తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. విషయం తెలిసిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు మారుతికి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. 

తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్న మారుతి స్టార్ హీరోలను సైతం డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మారుతి డైరెక్ట్ చేసిన మంచి రోజులు వచ్చాయి సినిమా గతేడాది నవంబరులో రిలీజ్ అయ్యింది. ఇక త్వరలో గోపీచంద్ తో మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే, ప్రభాస్‌తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారు మారుతి. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది.