భాక్సాఫీస్ దగ్గర ‘సిందూరం’ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. కాకపోతే  జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలచింది. ఈ చిత్రానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు లభించింది. 


కృష్ణవంశీ కు డైరక్టర్ గా ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కెరీర్ ప్రారంభంలో డిఫరెంట్ చిత్రాలు అందించారు. క్రియేటివ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. నాగార్జున తో నిన్నే పెళ్ళాడుతా సినిమాని తెరకెక్కించి పెద్ద హిట్టును సొంతం చేసుకున్నారు . ఈ సినిమాకి గాను కృష్ణవంశికి నంది అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు లభించింది . ఈ సినిమా తర్వాత ఆయనే స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి 'ఆంధ్రా టాకీస్' సంస్థను ప్రారంభించాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి చిత్రీకరంచిన సింధూరం అనే సినిమా చేసారు. విమర్శకుల ప్రశంసలు పొందినా, ఆర్థికంగా క్రుంగదీసింది. ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి సముద్రం లాంటి సినిమాలను తీసినట్టు స్వయంగా అతనే ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇప్పుడు మరోసారి అదే టాపిక్ వచ్చింది.

ప్రస్తుతం పాత సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ‘సింధూరం’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయమని కోరాడు. ‘కృష్ణవంశీ గారు ఒక్కసారి సింధూరం సినిమా రిలీజైతే నా లాంటి చాలా మంది 4 షోస్ చూడటానికి సిద్ధంగా ఉన్నాము సార్…. దయచేసి ఈ మా ఆశ నెరవేర్చాలని కోరుతున్నాము సార్.. “నా జీవితంలో నేను చూసిన గొప్ప సినిమా సింధూరం”..మరణం లోపు మరల మరల చూడాలనిపించిన చిత్రం, వినాలి అనిపించే సంగీతం.” అంటూ ట్విట్టర్ కృష్ణవంశీని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. ఇందుకు కృష్ణవంశీ బదులిస్తూ.. “అమ్మో.. 5 ఏళ్ళు అప్పులు కట్టాను అయ్యా.. వామ్మో ‘ అంటూ దణ్ణం పెట్టేశాడు”..! ‘సింధూరం’ సినిమా అప్పుల భారాన్ని తన పై వేసుకున్నట్టు కృష్ణవంశీ తెలిపాడు. ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.


ఇక కృష్ణవంశీ ‘ఆంధ్రా టాకీస్’ అనే పతాకంపై తొలి ప్రయత్నంగా ‘సిందూరం’ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. పోలీస్ వర్సెస్ నక్సలిజమ్ పై తనదైన పంథాలో కృష్ణవంశీ ‘సిందూరం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ హీరోగా నటించగా, సైడ్ హీరో పాత్రలో రవితేజ కనిపించారు. 1997 సెప్టెంబర్ 12న ‘సిందూరం’ జనం ముందు నిలచింది. అయితే భాక్సాఫీస్ దగ్గర ‘సిందూరం’ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. కాకపోతే జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలచింది. ఈ చిత్రానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు లభించింది. దాంతో పాటు ఉత్తమ సంభాషణల రచయితగా పతంజలికి, ఉత్తమ గీతరచయితగా సిరివెన్నెలకు, ఉత్తమ గుణచిత్ర నటునిగా పరుచూరి వెంకటేశ్వరరావుకు, ఉత్తమ సహాయనటునిగా సూర్యకు నంది అవార్డులు దక్కాయి.

 ఈ చిత్రానికి ప్రముఖ జర్నలిస్ట్, రచయిత కె.ఎన్.వై. పతంజలి సంభాషణలు పలికించారు. శ్రీ స్వరకల్పనలో రూపొందిన ఆరు పాటల్లో “హాయ్ రే హాయ్… జాంపండురోయ్…” అనే పాటను చంద్రబోస్ పలికించగా, మిగిలిన ఐదు పాటలూ సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి జాలువారాయి. ఇందులోని “అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంద్రమందామా…” అంటూ మొదలయ్యే గీతం జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది, ఆలోచింప చేసింది. “ఏడు మల్లెలెత్తు సుకుమారికి…”, “ఓ చెలీ అనార్కలీ…”, “ఊ లే లే ఊ లే లే…”, “ఊరికే ఉండదే….” అంటూ సాగే పాటలు సైతం అలరించాయి.

ఇందులో బుల్లిరాజుగా బ్రహ్మాజీ, చంటిగా రవితేజ, బేబిగా సంఘవి నటించారు. మిగిలిన పాత్రల్లో గీత, నరసింహరాజు, భానుచందర్, చలపతిరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీరాజా, పృథ్వీ, అన్నపూర్ణ, సూర్య, ఆహుతి ప్రసాద్, బండ్ల గణేశ్ కనిపించారు.