క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తన కొత్త సినిమాపై ప్రకటన చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నెక్స్ట్ మూవీ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి కలిగించారు కృష్ణ వంశీ. అన్నం.. పరబ్రహ్మ స్వరూపం అనే టైటిల్ తన కొత్త సినిమాకు నిర్ణయించాడు కృష్ణ వంశీ. ఇక టైటిల్ డిజైన్ హిసాత్మకంగా.. ఊర మాస్ గా ఉంది. 


అన్నం వడ్డించిన అరిటాకు ఇస్తరులో రక్తం మరకలు, వేట కొడవలి మరియు మంగళ సూత్రం ఉన్నాయి. కృష్ణ వంశీ 'అన్నం' మూవీతో మాస్టర్ పీస్ అంతఃపురం చిత్రాన్ని గుర్తు చేస్తారేమో చూడాలి. ఇక అన్నం మూవీ ప్రీ ప్రొడక్షన్ మొదలైందని కృష్ణ వంశీ తెలియజేశారు. నటీనటులు , సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. 


ఇక కృష్ణ వంశీ ప్రస్తుంతం రంగమార్తాండ మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక కీలక రోల్స్ చేస్తున్నారు. మరాఠి చిత్రం రీమేక్ గా రంగమార్తాండ తెరకెక్కుతుంది.