దర్శకుడు గోపీచంద్ మలినేని తన కెరీర్ లోనే అద్భుతమైన దశలో ఉన్నారు. ఆయన తెరకెక్కించిన క్రాక్ చిత్రం 2021 సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని బాలయ్యతో వీరసింహారెడ్డి చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై హిట్ కొట్టింది. 

కమర్షియల్ చిత్రాలని మాస్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకెక్కించే దర్శకుడిగా గోపీచంద్ గుర్తింపు పొందారు. రెండు వరుస చిత్రాల విజయాలతో గోపీచంద్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఒంగోలుకు చెందిన గోపీచంద్ మలినేని ఉగాది సందర్భంగా తన సొంత గ్రామం బొద్దులూరివారి పాలెం లో పర్యటించారు. 

ఈ తన గ్రామం కోసం గోపీచంద్ మలినేని సొంత ఖర్చులతో నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభించారు. తన స్నేహితులు, బంధువుల సహకారంతోనే ఈ బస్ షెల్టర్ నిర్మాణం సాధ్యం అయింది అని గోపీచంద్ మలినేని అన్నారు. తన సొంత ఊరి కోసం తాను చేసింది కొంత మాత్రమే అని.. ఊర్లో ఇంకా చేయాల్సి పనులు చాలా ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో తన స్నేహితుల సహకారంతో అవి కూడా పూర్తి చేస్తానని అన్నారు. 

ఎక్కడా ఉన్నా తన గ్రామంలో నాలుగు రోజులు గడిపితే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని గోపీచంద్ అన్నారు. తన తాత పెద సుబ్బయ్య , తండ్రి మలినేని వెంకటేశ్వర్లు చౌదరి జ్ఞాపకార్థం ఈ బస్ షెల్టర్ ని గోపీచంద్ నిర్మించారు. 

ఈ కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ.. వీర సింహారెడ్డి చిత్రం తెరకెక్కించిన మైత్రి మూవీస్ బ్యానర్ లోనే తన తదుపరి చిత్రం కూడా ఉండబోతున్నట్లు గోపీచంద్ మలినేని తెలిపారు. లోకల్ గా సంచలనం సృష్టించిన ఒక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమా తెరకెక్కించబోతున్నట్లు గోపీచంద్ తెలిపారు. క్రాక్ చిత్రాన్ని కూడా గోపీచంద్ ఇదే తరహాలో రూపొందించిన సంగతి తెలిసిందే.