Asianet News TeluguAsianet News Telugu

`నల్లమల`లోకి మానవ రూపంలోని క్రూరమృగం ఎంటరైతే..

సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న చిత్రం `న‌ల్ల‌మ‌ల‌`. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా  రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

director devakatta released nallamala movie teaser
Author
Hyderabad, First Published Oct 1, 2021, 8:52 PM IST

నల్లమల(nallamala) అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న చిత్రం `న‌ల్ల‌మ‌ల‌`. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా  రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ఏమున్న‌వే పిల్లా సాంగ్ మిలియ‌న్స్ కి పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. 

తాజాగా ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, `ఏమున్నావే పిల్ల‌` పాటను నేను నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్‌లో ఉంటే వింటాను. ఇలాంటి పాట నాకు ఒక్కటి కూడా లేదని అసూయ పడ్డాను. ఈ ఆడిటోరియంలోనే ఎంతో లైఫ్ ఉంది. ఇది అందరినీ బ్లెస్ చేస్తుంది. ఈ సినిమా వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను` అని అన్నారు. 

న‌టుడు అమిత్ మాట్లాడుతూ.. దేవాకట్టాకి థ్యాంక్స్ చెప్పారు. తనని ఈ చిత్రంలో హీరోగా తీసుకున్నందుకు దర్శకుడు చరణ్‌కి ధన్యవాదాలు తెలిపారు. `మొదటిసారి ఈ కథ విన్నప్పుడే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నాకు ఏ విలన్ కారెక్టర్ ఇస్తారో.. ఏ కారెక్టర్ ఇస్తారో అని అనుకున్నా. కానీ హీరో మీరే అన్నప్పుడు షాక్ అయ్యా. కానీ ఈ సినిమాకు నేను హీరో కాదు... కథే  హీరో. కథ ఎంతో అందంగా ఉంటుంది` అని చెప్పాడు.

`నాకు పల్లెటూరి పిల్లలా ఉండటం చాలా ఇష్టం. ఇలాంటి పాత్ర నాకు వస్తుందని ఊహించలేదు. `నల్లమల` సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన పాట చాలా పెద్ద హిట్ అయింది. ఎక్కడికి వెళ్లినా ఆ పాటతోనే నన్ను గుర్తిస్తున్నారు. కెమెరామెన్  నన్ను చాలా ఆనందంగా చూపించారు. మేకప్ వేసుకున్నా కూడా వద్దు అంటూ సహజంగా అందంగా చూపించారు. పాటల వల్లే `నల్లమల` అనే చిత్రం ఉందని తెలిసింది. అంత మంచి పాట ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్‌కు థ్యాంక్స్. నేను బాగా నటించాను అని ఎప్పుడూ డైరెక్టర్ చెబుతుంటారు. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్` అని హీరోయిన్‌ భానుశ్రీ తెలిపింది.

`అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటాం. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చా ఆయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయింది. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే  ఈ కథ` అని దర్శకుడు రవి చరణ్‌ చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios