విలక్షణ దర్శకుడు బాలా మేకింగ్ గఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి సినిమా నుంచి తన డిఫరెంట్ డైరెక్షన్ తో ఆడియెన్స్ ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య ఆయన క్రేజ్ కొంత తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా విక్రమ్ తనయుడు ధృవ్ ని పరిచయం చేయాలనీ అనుకున్న బాలాకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. 

ధృవ్ తో అర్జున్ రెడ్డి కథను తమిళ్ ;లో రీమేక్ చేసిన బాలా షూటింగ్ దశలోనే సినిమాను ఆపేశాడు. విక్రమ్ కి బాలా మేకింగ్ నచ్చకపోవడంతో మళ్ళీ వేరే దర్శకుడితో రీ షూట్ చేశారు. ఆ సంగతి పక్కనపెడితే బాలా తో ఒక సినిమా చేయడానికి హీరో సూర్య సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో మరొక హీరో కూడా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. కెరీర్ మొదట్లో సూర్యకి మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం శివపుత్రుడు. బాల డైరక్ట్ చేసిన ఆ సినిమాతో విక్రమ్ కెరీర్ తో పాటు సూర్య కెరీర్ కూడా ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. 

ఇకపోతే ఇప్పుడు మాస్ తరహాలో ఉండే ప్రయోగాత్మకమైన కథను సిద్ధం చేసుకున్న బాలా సూర్యతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మరో కథానాయకుడి పాత్ర కోసం అథర్వని అనుకుంటున్నట్లు టాక్ వస్తున్నప్పటికీ ఇంకా ఫైనల్ చేయలేదు. మరి చాలా రోజుల తరువాత సెట్స్ పైకి వస్తున్న ఈ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.