బ్రాహ్మాస్త్ర పై రకరకాల రూమర్లు బయటకు వచ్చాయి. ఈమూవీ ఆగిపోయిందతి అని అన్నవారు కూడా లేకపోలేదు. అయితే ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ.. ఈసినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ.. అదరిపోయే అప్ డేట్ ఇచ్చేశాడు. మిగిలిన రెండు భాగాలు ఎప్పుడు రిలీజ్ చేసేది అనౌన్స్ చేశాడు అయాన్.
కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కు కాస్తో కూస్తో ఊరటనిచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. అప్పటికే వరుస ప్లాప్ లతో హిందీపరిశ్రమ కుదేలు అవుతున్న టైమ్ లో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కి ఆడియన్స్ ముందుకు వచ్చి.. సూపర్ హిట్ అయిన చిత్రం బ్రహ్మాస్త్ర. . రణ్‌బీర్ కపూర్ అలియా భట్ జంటగా కలిసి నటించిన ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ , నాగార్జున అతిధి పాత్రల్లో కనిపించారు. ఇక బాలీవుడ్ స్టార్స్ .. .. అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లలో మెరిసారు.
అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. మొత్త మూడు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం రిలీజ్ అయ్యి మంచి పేరు సాధించింది. ఇక తరువాత రెండుసినిమాలు రిలీజ్ కు చాలా టైమ్ పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతున్నా.. ఇప్పటి వరకు మిగిలిన పార్ట్స్ పై ఎటువంటి అప్ డేట్స్ ఇవ్వలేదు మూవీ టీమ్. ఆడియన్స్ తో పాటు అభిమానులకు కూడా కన్ ఫ్యూజన్ లో పెట్టారు టీమ్.
అయితే.. ఈసినిమాపై ఎటువంటి ప్రకటన రాకపోవడంతో.. బ్రాహ్మాస్త్ర పై రకరకాల రూమర్లు బయటకు వచ్చాయి. ఈమూవీ ఆగిపోయిందతి అని అన్నవారు కూడా లేకపోలేదు. అయితే ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ.. ఈసినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ.. అదరిపోయే అప్ డేట్ ఇచ్చేశాడు. మిగిలిన రెండు భాగాలు ఎప్పుడు రిలీజ్ చేసేది అనౌన్స్ చేశాడు అయాన్. ఒకేసారి మిగిలిన రెండు భాగాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు. బ్రామ్మస్త్ర సెకండ్ పార్ట్ దేవ్ ని (Dev) 2026 డిసెంబర్ లో, మూడో భాగం బ్రహ్మాంష్య్ ని (Brahmansh) 2027 డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈ సినిమాలు ఎందుకు లేట్ అవుతున్నాయో తెలియదు కాని.. ప్రస్తుతం ఈ రెండు ఫ్రాంచేజ్ సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఫస్ట్ పార్ట్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినా.. కొన్ని చోట్ల డైరెక్టర్ చేసిన తప్పుడు స్పస్టంగా కనిపించాయి. దాంతో అది దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పార్ట్స్ ని మరింత బెటర్ గా తెరకెక్కించే ప్రయత్నంచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సెకండ్ పార్ట్ దేవ్ లో టైటిల్ రోల్ ని ఎవరు పోషిస్తున్నారు అనే దాని పై ఇంకా స్పష్టత రాలేదు.
అయితే ఫస్ట్ పార్ట్ లో నటించిన రణ్ బీర్.. ఈసినిమాలో హీరోగా నటిస్తారా..? లేక ఇంకెవరైనా బాలీవుడ్ హీరో చేస్తారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎవరూ హీరో అన్నదానిపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ భారీగా పెరిగిపోతోంది. అయితే దీనిపై రకరకాల రూమర్స్ బయటకు వస్తున్నాయి. హీరోపై రోజుకో వార్త బయటకి వస్తుంది. మరి చివరికి ఆ పాత్ర ఎవరు చేస్తారో చూడాలి.
