Asianet News TeluguAsianet News Telugu

షారుఖ్ తో మాట్లాడి.. జవాన్ ను ఆస్కార్ కు పంపిస్తానన్న అట్లీ..ఆడేసుకుంటున్న నెటిజన్లు

జవాన్ సినిమాను ఆస్కార్ కు తీసుకెళ్తాడట డైరెక్టర్ అట్లీ.. షారుఖ్ ఖాన్ తో మాట్లాడి ఆస్కార్ కు పంపే ఏర్పాట్లు కూడా చేస్తాను అంటున్నాడు. ఇక ఈ విషయంలో నెటిజన్లు ఏమంటున్నారంటే..? 
 

Director Atlee Says Jawan Movie Sent To Oscar Race JMS
Author
First Published Sep 19, 2023, 7:57 AM IST

బాలీవుడ్ బాద్ షా  షారుఖ్ ఖాన్(Shahrukh Khan) హీరోగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా జవాన్.  సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల  ముందుకు వచ్చిన  జవాన్(Jawan) బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్ సాధించింది.  నాలుగేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్.. వరుసగా రెండు సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.  పఠాన్ తో బాలీవుడ్ లో మాత్రమే బ్లాక్ బస్టర్ ఇచ్చిన షారుఖ్.. ఆసారి సౌత్ ను కూడా టార్గెట్ చేశాడు.  

తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ స్టార్ హీరోయిన్ నయనతార బాద్ షాతో జత కట్టింది. విజయ్ సేతుపతి విలన్ గా.. నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సూపర్  సక్సెస్ తో పాటు..  ఇప్పటి వరకూ.. దాదాపు 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి 1000 కోట్ల వైపుకు దూసుకెళ్తుంది. పఠాన్ తర్వాత జవాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సక్సెస్ సాధించడంతో షారుఖ్ దిల్ ఖుష్ అయ్యాడు.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.. ఇక తాజాగా ఈమూవీకి సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

జవాన్ సక్సెస్ తో డైరెక్టర్ అట్లీ కెడిట్ కూడా భారీగా పెరింది. పెద్ద పెద్ద ఆఫర్లు కూడా ఒకే అయ్యేలా ఉన్నాయట. మూవీ టీమ్ వరుసగా పెద్ద పెద్ద మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. తాజాగా డైరెక్టర్ అట్లీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ఆయన జవాన్ సినిమాను ఆస్కార్ కు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను అన్నాడు. 

 

ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తూ...  జవాన్ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.. ఇక ఎలాంటి అవార్డ్స్ వస్తాయి అని ఆశిస్తున్నారు అని ప్రశ్నించగా..  అట్లీ మాట్లాడుతూ.. కచ్చితంగా అనుకున్నవి అన్ని జరిగితే జవాన్ ఆస్కార్స్ కి వెళ్తుంది. ప్రతి డైరెక్టర్, ప్రతి సినిమా, సినిమాకు సంబంధించిన వాళ్లంతా వాళ్ళ సినిమాలకు అవార్డులు రావాలని కోరుకుంటారు. ఆస్కార్స్, గోల్డెన్ గ్లోబ్, నేషనల్ అవార్డ్స్.. ఇలా ప్రతిషాత్మకమైన అవార్డులు తమ సినిమాలకి రావాలనుకుంటారు. నేను కూడా అంతే జవాన్ సినిమాని ఆస్కార్స్ కి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను. షారుఖ్ సర్ తో నేను మాట్లాడి ఆస్కార్ కి పంపించే ప్రయత్నాలు చేస్తాను అని తెలిపాడు.

అయితే అట్లీ కామెంట్స్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫ్యాన్స్ సపోర్టీవ్ గా కామెంట్స్ చేస్తుంటే.. ఎక్కువ మంది నెటిజన్లు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. ఆస్కార్ అంటే ఏదో సింపుల్ గా.. ఇలా వెళ్తే.. అలావచ్చేస్తుంది అనుకుంటున్నాు.. ప్రతి సినిమాని ఆస్కార్ కి పంపిస్తాం అంటున్నారు. జవాన్ సినిమాలో ప్రత్యేకత ఏముంది..  కొత్త కథేమి కాదు కదా..? పాత కమర్షియల్ కథను కాస్త కొత్తగా తయారు చేశాడు.  సౌత్ వాళ్లు ఇలాంటి సినిమాలు ఎప్పుడో చూశారు.. బాలీవుడ్ కు ఇవి కొత్త కాబట్టి.. షారుఖ్ ను కొత్తగా చూపించేసరికి ఆదిరించారు. అందుకే అక్కడ జవాన్ హిట్ అయ్యింది అంటున్నారు. 

అసలు కరెక్ట్ గా మాట్లాడుకుంటేు.. జవాన్  ఫ్లాప్ సినిమా... అది  రిలీజ్ అయిన దగ్గర్నుంచి సినిమాపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమాలోని అన్ని సీన్స్ ఏదో ఒక సినిమా నుంచి కాపీ కొట్టినవే అని నెటిజన్స్ ట్రోల్ చేశారు. జవాన్ కు ఆస్కార్ అంటూ.. అట్లీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  మరీ ఓవర్ అంటూ పలువురు నెటిజన్లు, మీమర్స్ అట్లీ మీద ట్రోల్స్ చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios