దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందించాడు. ఈ సినిమా మొదటి భాగం 'కథానాయకుడు' ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. 

ఈ సినిమా కోసం క్రిష్ బాలీవుడ్ 'మణికర్ణిక' సినిమాను మధ్యలోనే వదిలి వచ్చేశాడని వార్తలు వచ్చాయి. హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. 'మణికర్ణిక' సినిమాలో చాలా భాగాన్ని తానే డైరెక్ట్ చేశానని చెప్పింది కంగనా.. అంతేకాదు ఆమె కారణంగా సినిమా నుండి కొందరు తప్పుకున్నారని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి.

కానీ వీటిపై ఇప్పటివరకు నోరు విప్పని క్రిష్ తాజాగా ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయంపై మాట్లాడాల్సి వచ్చింది. మణికర్ణిక సినిమా కోసం వంద రోజులు షూటింగ్ లో పాల్గొన్నట్లు చెప్పిన క్రిష్ ఆ సినిమా రీరికార్డింగ్ లో ఉన్న సమయంలో 'ఎన్టీఆర్' బయోపిక్ చేసే అవకాశం వచ్చిందని.. అప్పటికి 15 రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమేమిగిలి వుందని స్పష్టం చేశాడు.

తరువాత పూర్తి చేద్దామని ఎన్టీఆర్ బయోపిక్ కోసం వస్తే 'మణికర్ణిక' రిలీజ్ డేట్ మారిందని వెల్లడించారు. సినిమా చేతులు మారిందని, ఆ తరువాత రకరకాల మార్పులు జరిగాయని అన్నారు. అయినా ఇప్పటికీ ఆ చిత్రయూనిట్ తో కాంటాక్ట్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.