డింపుల్ హయతీతోపాటు ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం హీరోయిన్ డింపుల్ హయతీ, విక్టర్ డేవిడ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
తనపై పోలీస్ కేసు వివాదంపై తాజాగా హీరోయిన్ డింపుల్ హయతి స్పందించింది. డీసీపీ కి ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అధికార దుర్వినియోగం అంటూ ట్వీట్ చేసింది. అధికారం ఏ తప్పులను దాయదంటూ సంచలన పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె చెబుతూ, `అధికారం ఉపయోగించడం వల్ల ఏ తప్పులను ఆపదు, అధికార దుర్వినియోగం ఏ తప్పులను దాయదు` అంటూ ట్వీట్లు చేసింది. చివరగా `సత్యమేవ జయతే` అనిపంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి ట్వీట్లు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి.వైరల్ అవుతూ వివాదం మరింత పెంచేలా చేస్తుంది. అయితే కొందరు సినీ ప్రముఖులు ఈ విషయంలో డింపుల్‌కి సపోర్ట్ చేస్తుండగా, నెటిజన్లు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. మీంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. మరి అసలు గొడవేంటనేది ఓ సారి చూస్తే,
జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్ అధికారి ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నారు. ఇదే అపార్ట్ మెంట్లోని ఫ్లాట్ నంబర్ సీ (2)లో టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ తన బోయ్ ప్రెండ్ విక్టర్ డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. ఆ భవంతికి చెందిన పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన డీసీపీకి చెందిన అధికారిక వాహనానికి అడ్డుగా డింపుల్ హయతీ, విక్టర్ డేవిడ్‌లు తమ బీఎండబ్ల్యూ కారును పెట్టడంతో పాటు అకారణంగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎం.చేతన్ కుమార్‌తో వాగ్వాదానికి దిగుతుంటారు. తమ కారును తీసేందుకు వీలుగా కారు పార్క్ చేసుకోవాలని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకుండా పలుమార్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలో ఈనెల 14న రాత్రి పార్క్ చేసిన డీసీపీ అధికారిక వాహనంను డింపుల్ హయతీ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కారుకు ఇతర వాహనాలు తగలకుండా జాగ్రత్త నిమిత్తం పెట్టిన కోన్స్‌ను, డీసీపీ కారును కాలితో తన్ని రచ్చ చేసింది. ఆ సమయంలో ఇదేంటని ప్రశ్నించిన కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించింది. దీంతో కానిస్టేబుల్ చేతన్ కుమార్ మూడురోజుల కిందట జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డింపుల్ తరచూ అతిగా ప్రవర్తిస్తున్నారని, ఎన్నిసార్లు సర్ధిచెప్పినా డింపుల్ వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు డింపుల్ హయతీతోపాటు ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం హీరోయిన్ డింపుల్ హయతీ, విక్టర్ డేవిడ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఆస్తుల విధ్వంసం కేసుపెట్టారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ఇక హీరోయిన్ డింపుల్ హయతి ఇటీవల `రామబాణం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది.ఈ సినిమా పరాజయం చెందింది.
