గతంలో రష్మిక నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. వారి జాతకం ప్రకారం వేణు స్వామి పూజలు చేయాలని సూచించారట. ఇప్పుడు అదే బాటలో మరో క్రేజీ హీరోయిన్ నడిచింది.
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది.
ఆయన బాగా పాపులర్ అవుతుండడంతో సెలెబ్రిటీలు కూడా వేణు స్వామి వెంట పడుతున్నారు. ఆయన దగ్గర తమ జాతకాలు చెప్పించుకోవడం, దోషాలు ఏమైనా ఉంటే పరిహారం చేయించుకోవడం చేస్తున్నారు. గతంలో రష్మిక నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. వారి జాతకం ప్రకారం వేణు స్వామి పూజలు చేయాలని సూచించారట.
ఇప్పుడు అదే బాటలో మరో క్రేజీ హీరోయిన్ నడిచింది. అందం, డ్యాన్స్, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ డింపుల్ హయతి హీరోయిన్ గా సక్సెస్ కావడం లేదు. ఆమె చివరగా నటించిన ఖిలాడీ, రామబాణం రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. అలాగే ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్ వద్ద పోలీస్ అధికారితో జరిగిన వివాదం కూడా వార్తల్లో సంచలనం సృష్టించింది. ఊహించని విధంగా డింపుల్ హయతి వివాదాల్లో చిక్కుకుంది.
వీటన్నింటికి కారణం జాతకంలో దోషం ఉండడం వల్లే అని.. వేణు స్వామి సూచించినట్లుగా ఆయన సమక్షంలో డింపుల్ ప్రత్యేక పూజలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డింపుల్ హయతి గద్దలకొండ గణేష్ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకి నృత్యంలో ప్రత్యేక ప్రావీణ్యం ఉంది. అందుకే సాంగ్స్ లో డింపుల్ రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం చూస్తున్నాము.
