కొన్ని సినిమాలు ఏ ముహూర్తన మొదలౌతాయో కానీ మేకింగ్ లో రకరకాల ట్విస్ట్ లు పడుతూంటాయి. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆ ప్రాజెక్టు దెబ్బకు కుదేలు అవ్వాల్సిందే. ఎలాగోలా ముగించి బయిటకు నెడదామన్నా ముందుకు కదలనంటాయి. ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ నే దిల్ రాజు ఎదుర్కొంటున్నాడంటున్నారు. ఆయన ఎంతో మక్కువతో మొదలెట్టిన శీనయ్య సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటోందిట. దిల్ రాజు వంటి నిర్మాతకు సైతం విసుగెత్తి,ఓ టైమ్ లో ఆపేద్దామనుకున్నాడట. అయితే తన బ్యానర్ లో ఇన్నాళ్లూ ఒక్క సినిమా కూడా ఆగలేదని,అలాంటి బ్యాడ్ రిమార్క్ ఈ సినిమాతో ఎందుకు తెచ్చుకోవాలని ఆగాడట.

వివరాల్లోకి వెళితే..

మాస్ డైరక్టర్ వి వి వినాయక్ హీరోగా మారిపోయాడు .. శీనయ్య టైటిల్ తో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి నరసింహారావు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొంతవరకూ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత అవుట్ పుట్ పట్ల వినాయక్ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, ప్రాజెక్టు ఆగిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోలేదట. శీనయ్య సినిమా షూటింగ్‌ను మళ్లీ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.షూటింగ్‌ ను మళ్లీ ప్రారంభించి నెల రోజుల్లోనే పూర్తి చేయాలని దిల్‌రాజు దర్శకుడుకు సూచించినట్లుగా తెలుస్తోంది.

ఒక వైపున స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతూనే, మరో వైపున షూటింగును తిరిగి ఆరంభించాలనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ నెల 19 లేదా 20వ తేదీల్లో ఈ సినిమా షూటింగు తిరిగి ప్రారంభం కానున్నట్టుగా సమాచారం. దిల్‌రాజు ఈ ప్రాజెక్టుతో నష్టపోయినా పర్వాలేదు అనే నిర్ణయానికి వచ్చి శీనయ్యను విడుదల చేయాలని భావిస్తున్నాడట. గతంలో దిల్‌రాజు బ్యానర్‌కు ఇలాంటి పరిస్థితి రాలేదు.అందుకే బ్యానర్‌కు చెడ్డ పేరు రావద్దనే ఉద్దేశ్యంతోనే శీనయ్యను ఫినిష్ చేస్తున్నాడట.