Asianet News TeluguAsianet News Telugu

దిల్ రాజు బ్యానర్ సినిమా...టీజర్ ఇంట్రస్టింగ్ గా ఉంది

 తాజాగా ప్రభాస్ ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ‘ఆ ఒక్క నిర్ణయం నా లైఫ్‌ను మార్చేసింది’అనే డైలాగ్ తో...

Dil Raju Suhas Janaka Aithe Ganaka teaser released jsp
Author
First Published Jul 5, 2024, 6:28 AM IST


చిన్న సినిమా అర్దం మెల్లి మెల్లిగా మారుతోంది. కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమాలుగా చిన్న సినిమాలు డిజైన్ చేస్తున్నారు. పెద్ద హీరోలకు రాసుకున్న కథలతో చిన్న సినిమాలు తీస్తే బోల్తా పడతామని నిర్మాతలు, దర్శకులు అర్దం చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా దిల్ రాజు ప్రొడ‌క్షన్స్‌ కాన్సెప్ట్ సినిమాలు రెడీ చేస్తోంది. ఏడాది క్రితం మొదటి ప్రయత్నంగా వచ్చిన బ‌లగం సూపర్ సక్సెస్  సాదిస్తే ‘ల‌వ్ మీ’ మాత్రం పూర్తి స్దాయిలో  నిరాశ పరిచింది. 

అయితే ఇప్పుడు సుహాస్ ప్రధాన పాత్రలో ‘జనక అయితే గనక’ అనే టైటిల్ తో సినిమా రెడీ చేసారు. ఎల్‌కేజీ, యూకేజీల‌కే ల‌క్ష‌లు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఒక మిడిల్ క్లాస్ యువ‌కుడు త‌న‌కు పిల్ల‌లు పుడితే వారిని ఎలా పెంచాలి, ఎలా చ‌దివించాలి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ప్రభాస్ ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ‘ఆ ఒక్క నిర్ణయం నా లైఫ్‌ను మార్చేసింది’అనే డైలాగ్ తో మొదలైన టీజర్ లో కాన్సెప్ట్ ని క్లియర్ గా చెప్పారు.

 ‘నేను ఒక వేళ తండ్రినైతే.. నా పెళ్లాన్ని సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్‌లో చూపించాలి.. నా పిల్లల్ని బెస్ట్ స్కూల్‌లో చేర్పించాలి.. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి.. బెస్ట్ లైఫ్ ని ఇవ్వాలి.. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు’ ఇది కోర్ ఐడియా.   దర్శకుడు సందీప్ ఇదే కాన్ ఫ్లిక్ట్ ని పట్టుకొని ఈ కథ తయారు చేసుకున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. హీరో క్యారెక్టరై జేషన్,తండ్రి పాత్రలో గోపరాజు రమణ ట్రాక్, ముఖ్యంగా స్మశానవాటికలో డిజైన్ చేసిన టీజర్ ఎడింగ్ ఇంట్రస్టింగ్ వున్నాయి.

 ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమా విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. సుహాస్‌తో పాటు, సంగీత్, వేన్నెల‌ కిషోర్, రాజేంద్ర ప్రసాద్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios