తన బ్యానర్ ఎన్నో కుటుంబ కథా చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకి 'పలుకే బంగారమాయే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'బొమ్మరిల్లు'లో .. అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు పరిచయం కానున్నట్టుగా సమాచారం.

దిల్ రాజకు ఇష్టమైన బొమ్మరిల్లు సినిమా లాంటి  ఓ మాంచి కథను, ఓ కొత్త దర్శకుడు తయారుచేసారని సమాచారం.  ఆ దర్శకుడు పేరు సతీష్ అని, దిల్ రాజు బ్యానర్ లో గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలకు డైరక్షన్ డిపార్టమెంట్ లో చేసారని వినికిడి. ఈ చిత్రాన్ని  ఆ దర్శకుడు తన టీం తో పక్కా స్క్రిప్ట్ గా మలిచినట్లు చెబుతున్నారు. దసరా రోజున ఈ సినిమాను లాంచ్ చేసి .. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నట్టు తెలుస్తోంది.

హీరోగా ..తన కజిన్ .. వ్యాపార భాగస్వామి అయిన శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం చేయనున్నారు. ఇక  ఇప్పటికే  దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఇప్పటికే హర్షిత్ 'లవర్' సినిమాతో నిర్మాతగా పరిచయమైన విషయం తెలిసిందే. ఇప్పుడు  ఆశిష్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యారు రాజు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ సినిమాకు ముహూర్తం ఖరారైంది. దసరా సందర్భంగా అక్టోబర్ 8న సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. యూత్ కి .. మాస్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి సరిపడే కథ అని తెలుస్తోంది.