ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పుడున్న పరిస్దితుల్లో సినీ వ్యాపారం ఎంతో రిస్కో తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఒకదాని తర్వాత మరొకటి లాంచ్ చేస్తున్నారు.స్టోరీ స్ట్రాంగ్ గా లేకపోతే అసలు ఏ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు. ఎన్నో స్టోరీ డిస్కషన్స్ జరిగాక అక్కినేని నాగ చైతన్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని దిల్ రాజు కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా పండగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. నాగచైతన్యతోపాటు సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుకు పి.సి శ్రీరామ్ పనిచేస్తూండటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

సాధారణంగా దిల్ రాజు టెక్నీషియన్స్ విషయంలో తన బ్యానర్ లో పనిచేసిన వారికే ప్రయారిటీ ఇస్తూంటారు. పెద్ద టెక్నీషియన్స్ జోలికిపోరు. అయితే విక్రమ్ కుమార్ చాలా పట్టుదలగా..పిసి శ్రీరామ్ కావాలని పట్టుబట్టి సీన్ లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. పి.సి శ్రీరామ్ కోసం దిల్ రాజు భారీ మొత్తం రెమ్యునేషన్ గా ఇస్తున్నారు. ఇంతకు ముందు ఏ సినిమాటోగ్రాఫర్ ఆ స్దాయి రెమ్యునేషన్ ఇవ్వలేదట.  నాగచైతన్య సైతం ఈ ప్రాజెక్టు ఓకే చేయటానికి పి.సి శ్రీరామ్ టెక్నీషియన్ కావటం ఓ కారణం అని తెలుస్తోంది.

నాగచైతన్య మాట్లాడుతూ..నా జీవితంలో ఒక ప్రత్యేక భాగమైన ఇద్దరు వ్యక్తులకు నేను థ్యాంక్‌ చెప్పాలి. ఒకరు నా మొదటి సినిమా నిర్మించిన దిల్‌ రాజుగారు. మరొకరు 'మనం' వంటి చిత్రాన్నిచ్చిన దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌. వీరిద్దరితో మరోసారి కలిసి పనిచేయబోతున్నందుకు, లెజండ్రీ కెమెరామెన్‌ పీసీ శ్రీరామ్‌ సార్‌తో పనిచేయబోతున్నందుకు చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉంది అన్నారు . 

 ‘ఇష్క్’, ‘మనం’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’.థ్యాంక్యూ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా బీవీఎస్ రవి సంభాషణలు అందించారు.