Asianet News TeluguAsianet News Telugu

Dil raju: రౌడీ బాయ్స్ లెక్కలు చెప్పిన దిల్ రాజు... కొత్త హీరోకి అంత వస్తే హిట్టేనట

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన రౌడీ బాయ్స్ మూవీ వసూళ్ల లెక్కలు విప్పారు. టాక్ ఎలా ఉన్నా... రౌడీ బాయ్స్ హిట్ అంటూ తేల్చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకత సంతరించుకున్నాయి.

dil raju opens up on rowdy boys collections conforms its a hit movie
Author
Hyderabad, First Published Jan 29, 2022, 5:06 PM IST

దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ (Ashish)రౌడీ బాయ్స్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆశిష్ మార్కెట్ తో సంబంధం లేకుండా భారీగా ఖర్చుపెట్టారు. తీరా సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు పెదవి విరిచారు. సినిమాలో సబ్జెక్టు లేకుండా ఎందుకు ఖర్చు పెట్టారని దిల్ రాజును ప్రేక్షకులు నిలదీశారు. రౌడీ బాయ్స్ విషయంలో దిల్ రాజు ఒకింత ట్రోల్స్ కి గురయ్యారు. బంధువు కావడంతో లెక్క లేకుండా డబ్బులు ఖర్చు పెట్టారని విమర్శిస్తున్నారు. 

ఇక రౌడీ బాయ్స్ (Rowdy boys)కలెక్టన్స్ లెక్కలపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. రౌడీ బాయ్స్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలిపారు. సినిమా రన్ ఇంకా కొనసాగుతుండగా... రూ. 15 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని అంచనా వేశారు. 

ఓ కొత్త హీరో సినిమాకు 15 కోట్ల గ్రాస్ అంటే హిట్ అయినట్లే లెక్క అన్నారు. హీరోగా ఆశిష్ నిరూపించుకున్నాడు. ఆయన డాన్సులు, యాక్టింగ్ యూత్ కి నచ్చింది. సినిమా కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. వసూళ్ల పరంగా మూవీ విజయం సాధించిందని దిల్ రాజు తెలియజేశారు. కొత్త హీరో సినిమాకు అంత బడ్జెట్ ఎందుకు పెట్టారనగా.. ఒక వ్యక్తి మార్కెట్ ని బట్టి నిర్మాత సినిమాలు తెరకెక్కిస్తారు. ఇప్పుడు ఆశిష్ మార్కెట్ గురించి ఐడియా ఉంది. నెక్స్ట్ అతనితో మూవీ చేస్తే బుడ్జెట్ రౌడీ బాయ్స్ మూవీ వసూళ్ల ఆధారంగా తెరకెక్కిస్తా అన్నాడు. 

ఇక టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు తెలుగు, తమిళ హిందీ భాషలలో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఓ మూవీ దిల్ రాజు ప్రకటించారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో జెర్సీ రీమేక్ తో పాటు ఎఫ్ 2 రీమేక్ చేస్తున్నారు. వెంకీ-వరుణ్ కాంబినేషన్ లో ఎఫ్ 3 తెరిక్కుతుండగా ఆ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. అలాగే సమంత శాకుంతలం చిత్రాన్ని గుణశేఖర్ తో కలిసి నిర్మిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios