స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బలగం చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది. జబర్దస్త్ కమెడియన్ గా ఉన్న వేణు ఎల్దండి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బలగం చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది. జబర్దస్త్ కమెడియన్ గా ఉన్న వేణు ఎల్దండి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మనసుని హత్తుకునే భావోద్వేగాలతో వేణు ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు.

తెలంగాణలో మారుమూల గ్రామాల్లో కూడా ఈ చిత్రం గురించే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అంత అద్భుతంగా ఈ చిత్రం సామాన్యులకు సైతం చేరువవుతోంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. 

తెలంగాణ భాష, యాస, పల్లెటూరి సంప్రదాయాలు, మనుషుల మధ్య బంధాలని వేణు కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఈ చిత్రం తెలంగాణాలో ఎంతలా వ్యాపించింది అంటే.. మారుమూల గ్రామాల్లో సైతం ఈ చిత్రాన్ని దండోరా వేసి మరీ ప్రదర్శిస్తున్నారు. రచ్చ బండల దగ్గర, దేవాలయాల్లో ఈ చిత్ర గ్రామ ప్రజలకు కొందరు ఉచితంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించి చూపిస్తున్నారు. 

Scroll to load tweet…

ఇది కాస్త వివాదంగా మారింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులని అమెజాన్ సంస్థ సొంతం చేసుకుంది. అమెజాన్ లో మార్చి 24న నుంచి ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. అలాగే థియేటర్స్ లో సైతం ఈ చిత్రాన్ని ఇంకా ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ చిత్రాన్ని గ్రామాల్లో అక్రమంగా ఉచిత ప్రదర్శనలు చేయడం వల్ల తమకి భారీ నష్టం అంటూ దిల్ రాజు పోలీసులని ఆశ్రయించారు. 

గ్రామాల్లో బలగం అక్రమ ప్రదర్శనలు అడ్డుకోవాలని దిల్ రాజు నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బలగం చిత్రాన్ని పల్లెటూరి ప్రజలకు ఇలా అక్రమంగా ప్రదర్శిస్తున్న వారి పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

Scroll to load tweet…

గ్రామాల్లో బలగం చిత్రాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పల్లెటూరి ప్రజలు ఈ చిత్రానికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ కంటతడి పెడుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఈ రోజు రాత్రికి గుడి వద్ద బలగం చిత్ర ప్రదర్శన అని దండోరా వేస్తున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా చిన్న చిత్రంగా మొదలైన బలగం ఈరోజు ఈ స్థాయి ఆదరణ దక్కించుకుంది అంటే గొప్ప విషయమే. 

బలగం అక్రమ ప్రదర్శనలు తమకి నష్టం అని దిల్ రాజు ప్రొడక్షన్ గగ్గోలు పెడుతుంటే.. ఈ చిత్రంలో హీరోగా నటించిన ప్రియదర్శి మాత్రం సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. పల్లె ప్రజలకు ఈ చిత్రం ఇంతలా చేరువ కావడంతో.. ఇది నా చిత్రమేనా అని ప్రియదర్శి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.