ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ విజయం.. టఫ్ ఫైట్ లో వెనుకబడ్డ సి కళ్యాణ్
టాలీవుడ్ లో ఎలాంటి ఎన్నికలు జరిగినా పెద్ద రసాభాస సాగుతోంది. గత కొన్నిరోజులుగా టాలీవుడ్ ట్రేడ్ కౌన్సిల్ ఎలక్షన్స్ సందడి నెలకొంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో ఈ సారి దిల్ రాజు, సి కళ్యాణ్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.
టాలీవుడ్ లో ఎలాంటి ఎన్నికలు జరిగినా పెద్ద రసాభాస సాగుతోంది. గత కొన్నిరోజులుగా టాలీవుడ్ ట్రేడ్ కౌన్సిల్ ఎలక్షన్స్ సందడి నెలకొంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో ఈ సారి దిల్ రాజు, సి కళ్యాణ్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా నేడు ఓటింగ్ ప్రక్రియ జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ కూడానా జరుగుతోంది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. విభాగాల వారీగా కార్యవర్గ సబ్యులని ఎంచుకునే ప్రక్రియ జరిగింది. ఇందులో ప్రొడ్యూసర్ సెక్టార్ లో మొత్తం 12 స్థానాల్లో 7 గురు సభ్యులు దిల్ రాజు ప్యానల్ నుంచి విజయం సాధించారు.
దిల్ రాజు, దామోదర వరప్రసాద్, పద్మిని, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, రవిశంకర్ యలమంచి ఈ విభాగంలో విజయం సాధించారు. ఇక స్టూడియో సెక్టార్ లో నలుగురిలో ముగ్గురు సభ్యులు దిల్ రాజు ప్యానల్ నుంచి విజయం సాధించి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు.
ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో మాత్రం రెండు ప్యానల్స్ పోటాపోటీగా తలపడ్డాయి. రెండు ప్యానల్స్ నుంచి చెరో ఆరుగురు విజయం సాధించారు. ఓవరాల్ గా అన్ని సెక్టార్ లలో దిల్ రాజు ప్యానల్ సభ్యులు మెజారిటీ పోస్టులు దక్కించుకోనున్నారు.
మొత్తంగా దిల్ రాజు ప్యానల్ కి 563 ఓట్లు రాగా.. సి కళ్యాణ్ ప్యానల్ కి 497 ఓట్లు నమోదయ్యాయి. అయితే ఇతర అంశాలపై ప్రస్తుతం ఛాంబర్ లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితాలని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాతలు దర్శకులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాఘవేంద్ర రావు, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి , ఆది శేషగిరిరావు లాంటి ప్రముఖులంతా ఓటు వినియోగించుకున్నారు.