నేచురల్ స్టార్ నాని, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ మధ్యకాలంలో దిల్ రాజుకి ఏ సినిమా కూడా కలిసి రావడం లేదు. బాక్సాఫీస్ వద్ద వరుస ఫ్లాప్ సినిమాలు రావడంతో కాస్త డీలా పడ్డాడు.

అయినప్పటికీ తన ప్రొడక్షన్స్ లో పలు సినిమాలను సెట్ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ తో 'మహర్షి', అలానే వరుణ్, వెంకటేష్ ల 'ఎఫ్2' సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు మరో సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇటీవల దిల్ రాజుని కలిసి ఓ కథ వినిపించాడట. కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండాలి. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నాని ఓ సినిమా బ్యాలన్స్ ఉండడంతో నానిని ఒక హీరోగా కన్ఫర్మ్ చేసి మరో హీరోగా దుల్కర్ ని సెట్ చేయాలని అనుకుంటున్నాడు.

ఈ క్రమంలో సంప్రదింపులు మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు బిజీగా ఉన్నారు. వారు డేట్స్ కేటాయించిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. దుల్కర్ కి తమిళ, మలయాళంలో కూడా క్రేజ్ ఉండడంతో అక్కడ కూడా సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.