టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఒక కథ నచ్చింది అంటే దాన్ని తెరపైకి తెచ్చేదాకా పట్టు వదలడు. ఆయన చేతిలో ఒక సినిమా పడింది అంటే దాదాపు హిట్టయినట్టే అనే మంచి బ్రాండ్ ను సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం దిల్ రాజు ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా కూడా మనసు మొత్తం 96 కథపైనే ఉందట. 

కోలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్న ఈ రొమాంటిక్ డ్రామా తెలుగులో కూడా మంచి హిట్టవుతుందని తెలుగు హక్కులను దిల్ రాజు కొన్నారు. గత కొన్ని వారాలుగా ఆయన కొంత మంది హీరోలకు స్పెషల్ షోలను వేస్తున్నారు. మొన్నటివరకు నాని - బన్నీలకు చూపించి చర్చలు కూడా జరిపాడు. రీసెంట్ గా శర్వానంద్ దగ్గరికి కూడా వెళ్ళింది. 

అయితే తమిళ్ లో త్రిష - విజయ్ సేతుపతి నటించగా అందులో విజయ్ సేతుపతి పాత్ర ఎక్కువ వయసు కలిగి ఉంటుంది. దీంతో ఈ హీరోలు స్టార్ డమ్ కి బయపడి కథ నచ్చినా కూడా చేయలేని పరిస్థితి. దీంతో రీసెంట్ గా దిల్ రాజు యాక్షన్ హీరో గోపీచంద్ తలుపుతట్టినట్లు తెలుస్తోంది. ఏమి మాట్లాడకుండా సినిమా స్పెషల్ షో వేసి గోపికి చూపించినట్లు సమాచారం. 

గత కొంత కాలంగా వరుస అపజయలతో ఉన్న గోపీచంద్ మంచి హిట్ తో మళ్ళి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ కి ఇప్పుడు గోపి ఎంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. ఇక విజయ్ సేతుపతికి తగ్గట్టుగా గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ సెట్టవుతుందని చెప్పవచ్చు. మరి తెలుగు 96 ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.