టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు.  ఆయన ప్రస్తుతం రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఒకటి రామ్ చరణ్ తో కాగా మరొకటి తమిళ హీరో విజయ్ తో. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. వీటి బిజినెస్ లు ప్రారంభమయ్యాయి.


డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు కు ఎంతో అనుభవం ఉంది. అలాగే ఆయన ఇప్పుడు తెలుగు పరిశ్రమలో నెంబర్ వన్ నిర్మాత. స్టార్ ప్రొడ్యూసర్. ఏ సినిమాని ఎంతకు రెడీ చేయాలో..ఎలా మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించాలో బాగా తెలుసు. ఆయన ఫెరఫెక్ట్ ప్యాకేజ్ చేస్తారంటారు. ఆయన సినిమాల నిర్మాణంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో, బిజినెస్ విషయంలో అలాంటి పేరే ఉంది. తాజాగా ఆయన రెండు భారీ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ రెంటికి ఇప్పుడు ఓ రేంజిలో బిజినెస్ ఆఫర్స్ ఉన్నాయి. 

వాటిలో ఒకటి సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో మొదటిసారి తెలుగులో సినిమా అందులోని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కాగా మరొకటి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని కూడా తెలుగులోకి పరిచయం చేస్తున్న సినిమా “వారసుడు”.ఇప్పుడు ఈ రెండు సినిమాలకి కలిపి ఓవర్సీస్ 65 కోట్లకి ఇస్తామన్నట్టు తెలుస్తుంది. బేరసారాలు జరిగి అరవై దగ్గర తెగుతుందని అంటున్నారు. ఓవర్ సీస్ రేట్లే ఇలా ఉంటే.....అన్ని ఏరియాలు, ఓటిటి, శాటిలైట్ , హిందీ డబ్బింగ్ కలిపితే దిల్ రాజు పెడుతున్న డబ్బులు కు రెట్టింపు మొత్తం వెనక్కి వచ్చేయడం ఖాయం అని చెప్పాలి.

 ఇక సినిమాల విషయానికి వస్తే తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఓ తెలుగు-తమిళ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కిస్తున్నాడు దిల్ రాజు. విజయ్ కెరీర్‌లో 66వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నాడు. వారసుడు టైటిల్ తో వస్తున్న ఈ సినిమాతో విజయ్ నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. 

అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చరణ్ 15వ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశారు.