టాలీవుడ్ లో  ట్రెండ్ సెట్ చేసి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచినా అర్జున్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే ఫ్లోలో బాలీవుడ్ లోకి వెళ్లిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ మరో రికార్డును క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా విడుదలై అత్యధిక లాభాలను అందించిన సినిమాల లిస్ట్ లో చేరింది. 

ఇక ఇప్పుడు అదే తరహాలో కోలీవుడ్ లో కూడా అర్జున్ రెడ్డి కథతో సక్సెస్ కొట్టడానికి ధృవ్ రెడీ అయ్యాడు. విక్రమ్ తనయుడు ఈ సినిమాతో కోలీవుడ్ కి హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ పై గత కొన్నాళ్లుగా వస్తున్న పుకార్లకు చిత్ర యూనిట్ ఎట్టకేలకు చెక్ పెట్టింది. ఆదిత్య వర్మ నవంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు ఎనౌన్స్ చేశారు. 

అర్జున్ రెడ్డి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన గిరిషయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నాడు. మొదట సినిమాను బాల తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సినిమా అనుకున్నట్లుగా రాకపోవడంతో ఆయన తప్పుకోవడంతో విక్రమ్ అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం ఇచ్చి రీ షూట్ చేశారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఫైనల్ అవుట్ ఫుట్ పై విక్రమ్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.