'ధూమ్' డైరెక్టర్ ఇక లేరు.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంజయ్ గాద్వి
ధూమ్, ధూమ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సంజయ్ గాద్వి(57) ఇక లేరు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది.

ధూమ్, ధూమ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సంజయ్ గాద్వి(57) ఇక లేరు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఆయన ఆదివారం రోజు మార్నింగ్ వాక్ చేస్తుండగా గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సంజయ్ గాద్వి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. బాలీవుడ్ లో ఈ మరణ వార్త తీవ్ర విషాదం గా మారింది.
అందుతున్న వివరాల ప్రకారం సంజయ్ గాద్వి ఆదివారం రోజు ఉదయం లోకండ్ వాలా బ్యాక్ రోడ్ లో మార్నింగ్ వాక్ చేస్తూ గుండెనొప్పికి గురయ్యారు. వేగంగా ఆయన్ని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజయ్ మరణించారు.
సంజయ్ గాద్వి అంత్యక్రియలు ఈ సాయంత్రం జరగనున్నట్లు తెలుస్తోంది. ధూమ్ ప్రాంచైజీలో మొదటి రెండు చిత్రాలని సంజయ్ గాద్వి తెరకెక్కించారు. యాక్షన్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పారు. ధూమ్ చిత్రాలతో ఇండియన్ యాక్షన్ చిత్రాలు కొత్త మలుపు తీసుకున్నాయి అని చెప్పొచ్చు. అప్పటి వరకు ఆ తరహా చిత్రాలు హాలీవుడ్ లో మాత్రమే సాధ్యం అయ్యేవి.
2000 సంవత్సరంలో సంజయ్ గాద్వి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు ఆయన ప్రారంభించిన తొలి చిత్రమే బడ్జెట్ కారణాలవల్ల ఆగిపోయింది. ఆ తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ తో చేతులు కలిపారు. ధూమ్ 2 తర్వాత సంజయ్ కిడ్నాప్అజాబ్ గజబ్ లవ్ లాంటి చిత్రాలు తెరకెక్కించినా అవి సక్సెస్ కాలేదు. ధూమ్, ధూమ్ 2 లో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్, ఉదయ్ చోప్రా , అభిషేక్ బచ్చన్ నటించిన సంగతి తెలిసిందే.