జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే దాదాపు ఇండియన్ సెలబ్రేటిస్ అందరికి తెలిసిన వ్యక్తే. అమిర్ ఖాన్ నుంచి వివేక్ ఒబెరాయ్ వరకు పవన్ అంటే చాలా ఇష్టమని చెప్పిన వారే. ఇక ఇండియన్ వికెట్ కీపర్ మిస్టర్ కూల్ ధోని కూడా పవర్ స్టార్ అంటే ఇష్టమని అన్నారు. 

2019 ఐపీఎల్ స్టార్ట్ కానున్న తరుణంలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న చెన్నై కెప్టెన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ స్టార్స్ గురించి మాట్లాడారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఇష్టమని చెబుతూ సౌత్ లో జూనియర్ ఎన్టీఆర్ - విజయ్ తలపతి వంటి స్టార్స్ కూడా ఇష్టమని ధోని వివర ణ ఇచ్చాడు. 

ఎలక్షన్స్ టైమ్ కావున ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 23వ తేదీ నుంచి స్టార్ట్ కానున్న ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ లో చెన్నై - బెంగుళూర్ టీమ్ లు తలపడనున్నాయి.