ధనుష్‌ అద్భుతమైన నటనతో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. అసురన్‌ చిత్రంలో ఆయన నటనే ఉదాహరణగా చెప్పకోవచ్చు. ఇప్పుడాయన తెలుగులో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేయబోతున్నారు. 

చిత్ర పరిశ్రమలో భాష అనే హద్దులు చెరిగిపోతున్నాయి. ఒక ఇండస్ట్రీకి చెందిన హీరో మరో ఇండస్ట్రీలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమా వచ్చాక అన్ని బార్డర్స్ బ్రేక్‌ అవుతున్నాయి. తెలుగు హీరోలు హిందీలో సినిమాలు చేస్తున్నారు. అలాగే తమిళ హీరోలు తెలుగులో సినిమాలు చేసేందుకు ముందుకువస్తున్నారు. బైలింగ్వల్‌, పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ధనుష్‌(Dhanush) తెలుగులో తొలి స్ట్రెయిట్‌ సినిమా చేస్తున్నారు. 

వెంకీ అట్లూరి దర్శకత్వంలో Dhanush నటించబోతున్నారు. ఇది తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా రూపొందుతుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకం, ఫర్చ్యూన్‌ 4 సినిమాస్‌ పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. ఈ చిత్ర టైటిల్‌ని వెల్లడించబోతున్నారు. రేపు(గురువారం-డిసెంబర్‌ 23)న ఈ చిత్ర టైటిల్‌ లుక్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. గురువారం ఉదయం 9.36 గంటలకు ఈ టైటిల్‌ ని రివీల్‌ చేయబోతున్నారు. పీరియడ్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ధనుష్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతున్నారు. 

ఇదిలా ఉంటే ధనుష్‌ తెలుగులో మరో స్ట్రెయిట్‌ సినిమా చేస్తున్నారు. ఇటీవల `లవ్‌స్టోరి` తో సూపర్‌ హిట్‌ అందుకున్న శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రాన్ని నారాయణ్‌దాస్‌నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు లు సంయుక్తంగా బైలింగ్వల్‌గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. 

ధనుష్‌ అద్భుతమైన నటనతో మెప్పిస్తున్న విసయం తెలిసిందే. అసురన్‌ చిత్రంలో ఆయన నటనే ఉదాహరణగా చెప్పకోవచ్చు. యంగ్‌ ఏజ్‌లో, అరవైఏళ్ల వృద్దుడి పాత్రలో అద్భుతమైన వేరియేషన్స్ చూపించి మెప్పించారు. అబ్బురపరిచారు. పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయడంలో ధనుష్‌ దిట్ట. అందులో భాగంగానే ఆయన `అసురన్‌` చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ని అందుకున్న విషయం తెలిసిందే. ఆయనకిది రెండో జాతీయ అవార్డు. గతంలో `ఆడుకాలం` చిత్రానికి గానూఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ధనుష్‌ హిందీలో `అట్రాంగి రే`, ఇంగ్లీష్‌లో `ది గ్రే మ్యాన్‌`, తమిళంలో `మారన్‌`, `తిరుచిత్రంబలం`,`నానే వరువేన్‌` చిత్రాల్లో నటిస్త్తూ బిజీగా ఉన్నారు. 

also read: