కమ్ముల సినిమాకి ధనుష్ రెమ్యునేషన్,ధనుష్ ట్వీట్
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది తెరకెక్కనుంది. సినిమా ఎనౌన్సమెంట్ కే ఎక్సపెక్టేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపద్యంలో ఈ ప్రాజెక్టు నిమిత్తం ధనుష్ కు ఎంత ఇస్తున్నారనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది.
వైవిధ్యమైన సినిమాలతో మెప్పిస్తున్న ధనుష్, ‘జగమే తంత్రం’ తో నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా విడుదలైన టాక్ జస్ట్ ఓకే అనిపించుకుంది. అయితే నిన్నటి రోజునే తన కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ రావడంతో అంతటా హాట్ టాపిక్ గా మారారు. అది కూడా తెలుగు దర్శకుడు, ఫీల్ గుడ్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులు దోచుకునే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.
శేఖరే ఈ ప్రాజెక్టుని స్వయంగా అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది తెరకెక్కనుంది. సినిమా ఎనౌన్సమెంట్ కే ఎక్సపెక్టేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపద్యంలో ఈ ప్రాజెక్టు నిమిత్తం ధనుష్ కు ఎంత ఇస్తున్నారనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ పాన్ ఇండియన్ సినిమాకు ధనుష్ 50 కోట్లు తీసుకుంటున్నాడని వినిపిస్తోంది. ఇక ధనుష్ ఈ సినిమాపై స్పందించాడు. “నిజంగా శేఖర్ కమ్ముల గారితో సినిమా చెయ్యడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని అలాగే నిర్మాతలు నరాంగ్ నారాయణ దాస్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావు గార్లతో కలిసి వర్క్ చేస్తుండడం కూడా సంతోషంగా ఉందని తెలిపి ఈ ట్రైలింగ్వుల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాని” ధనుష్ ఎగ్జైటింగ్ ట్వీట్ పెట్టాడు.
నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తున్న ధనుష్ ఈసారి భిన్నంగా ట్రై చేయాలని, తెలుగు స్ట్రయిట్ సినిమా చేయాలని శేఖర్ కమ్ములను చూజ్ చేసుకున్నారని అంటున్నారు.