నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి షాక్‌ ఇచ్చింది. ఎవరూ ఊహించిన మార్క్ ని దాటేసింది. సరికొత్త రికార్డులు సృష్టించింది. తమిళంలో ధనుష్‌, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `మారి 2`. ఈ చిత్రంలోని `రౌడీబేబీ` సాంగ్‌ సంచలనం సృష్టించింది. ఈ పాటని ఏకంగా వంద కోట్ల మంది వీక్షించారు. దీంతో ఇప్పుడిది సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేసింది. 

సౌత్‌ ఇండియాలోనే ఈ పాట ఇప్పుడు నెంబర్‌ వన్‌గా నిలిచింది. సౌత్‌లో ఇప్పటి వరకు ఏ పాట ఈ మార్క్ ని చేరుకోలేదు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` సినిమాలోని పాటలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇందులో `బుట్టబొమ్మ` సాంగ్‌ దాదాపు నలభై కోట్ల వ్యూస్‌ని దాటేసింది. ఈ ఆల్బమ్‌లోని పాటలు సైతం కోట్లల్లో వ్యూస్‌ని రాబట్టాయి. ఈ నేపథ్యంలో బన్నీకి షాక్‌ ఇచ్చేలా ధనుష్‌, సాయిపల్లవి జంటగా వచ్చిన `రౌడీ బేబీ` సాంగ్‌ కొత్త రికార్డు సృష్టించడం విశేషం. 

దీనిపై ధనుష్‌ స్పందించారు. `సౌత్‌లో ఇప్పటి వరకు ఏ పాట సాధించని రికార్డుని `రౌడీ బేబీ` సాధించిందని ధనుష్‌ తెలిపారు. ఒకప్పుడు ప్రపంచాన్ని షేక్‌ చేసిన పాట `కొలవెరి ఢీ` 9వ యానివర్సరీ రోజే ఈ పాట బిలియన్‌ వ్యూస్‌ సాధించడం సంతోషంగా ఉందని ధనుష్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. ఇక `మారి2` చిత్రానికి బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. ఇప్పుడు యువన్‌పై యావత్‌ దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.