బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. హీరో లేకపోయినా సోలోగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోగల సత్తా ఉన్న కంగనా దాకడ్ అనే మూవీలో నటిస్తోంది. ఆ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీతో కంగనా మరో సెన్సేషన్ క్రియేట్ చేయనుందని బాలీవుడ్ జనాలు కామెంట్ చేస్తున్నారు. 

ఓ మై గాడ్ అనేలా కంగనా చూపించిన హావభావాలు వర్ణనాతీతం. గన్ను పట్టుకొని సైకో రాక్షసిలా ఫైరింగ్ చేయడం ఆడియెన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కంగనా లుక్ లో కూడా సరికొత్తగా కనిపిస్తోంది. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.

రజనీష్ రాజి ఘాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  2020 దీపావళికి రిలీజ్ కానున్నట్లు టీజర్ లోనే ప్రకటించారు. ఇటీవల కంగనా మెంటల్ హై క్యా సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దాకడ్ సినిమాతో పాటు జయలలిత బయోపిక్ లో కూడా కంగనా నటించనుంది. ఆ సినిమాకు ఏఎల్.విజయ్ దర్శకుడు. .