Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో రిపోర్టర్ తప్పంతా మీ వైపు పెట్టుకొని వసుధార తప్పు రిషి సార్ తప్పు అని మాకు మెసేజ్ చేస్తారా. సారీ మేడం ఈ విషయంలో మేము హెల్ప్ చేయలేము. ఆల్రెడీ రిషి సార్ ఈ రిపోర్ట్స్ అందరి రిపోర్టర్స్ కి పంపించారు అనడంతో కాలేజీ ప్రొఫెసర్ షాక్ అవుతారు. రిషి సార్ కి చెప్పకు పోయి మీ తరఫున పోరాడితే మా జాబ్స్ పోయేవి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మేడం రిషి సార్ అంత దూరం ఆలోచించారా అనడంతో అవును గొడవ చేస్తారని ముందే తెలిసి రిపోర్టర్స్ కి ఆ రిపోర్టు ముందుగానే పంపించాడు అనడంతో చాలా గ్రేట్ మేడం అని అంటుంది వసుధార. రిషికి ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు ఏం చేయాలో అనుకుంటూ లోపలికి వెళ్తారు.
మరొకవైపు కాలేజీ ప్రొఫెసర్స్ దేవయాని దగ్గరికి వెళ్లి మేడం రిషి సారు రిపోర్టర్స్ అనడంతో మీరు చెప్పేది మొత్తం నాకు అర్థం అయింది. మీరు గొడవ చేస్తారని ముందే తెలిసి మీ ప్లాన్స్ కి చెక్ పెట్టారు అనగా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మేడం అనడంతో మిమ్మల్ని మళ్ళీ కాలేజీలోకి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు నీ సంగతి వదిలేయండి నేను చూసుకుంటాను అంటుంది దేవయాని. మిషన్ ఎడ్యుకేషన్ ప్రెస్ మీట్ లో ఎవరికీ తెలియని ఎవరు ఊహించని ట్విస్ట్ ఒకటి నేను ఇస్తాను అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. ఆ తర్వాత ప్రెస్ మీట్ మొదలవుతుంది. అప్పుడు జగతి మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఫణింద్ర మాట్లాడుతూ ఉంటాడు.
అప్పుడు ఫణీంద్ర వసుధార ని పొగుడుతూ మాట్లాడుతూ ఉండగా దేవయానికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వసుధార వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడాలి అనుకుంటుండగా అప్పుడు కావాలనే దేవయాని నేను కూడా వసుధార గురించి రెండు మాటలు మాట్లాడుతాను అని మైక్ దగ్గరికి వెళ్తుంది. వసుధార ఇప్పుడే చెప్తున్నాను రిషి ని వదిలిపెట్టి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో మర్యాదగా చెబుతున్నాను అని అంటుంది. అప్పుడు జగతి,మహేంద్ర దేవయాని వైపు చూసి అసలేం జరగబోతోంది అని టెన్షన్ పడుతూ ఉంటారు. నీకు ఇది ఫైనల్ వార్నింగ్ వసుధార రిషిని వదిలిపెట్టి ఈ కాలేజీ ని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది.
వెళ్తావా వెళ్ళవా అనడంతో మీరు ఏం చేసినా వెళ్ళను మేడం నేను ఎందుకు వెళ్లాలి అని అంటుంది. అప్పుడు దేవయాని వసుధార గురించి మాట్లాడుతూ ఈ కాలేజ్ కి దొరికిన ఒక వజ్రం లాంటిది అని మాట్లాడుతూ ఉండగా జగతి,వసుధార ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కాలేజీ లోకి స్టూడెంట్ గా జాయిన్ అయ్యి రిషికి అసిస్టెంట్ గా ఉంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూనే యూనివర్సిటీ టాపర్ అయ్యింది అని పొగుడుతూ ఉంటుంది దేవయాని. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు హెడ్ అయ్యి ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ని సక్సెస్ ఫుల్ గా విజయవంతం అయ్యేలా చేస్తోంది అని అంటుంది.
వసుధార లాంటి కూతురు ఉండాలని అందరూ ఆశపడితే నేను మాత్రం మా ఇంటికి వసుధార లాంటి అమ్మాయి కోడలిగా వస్తే బాగుండని అనుకున్నాను అనడంతో జగతి,మహేంద్ర వాళ్ళందరూ షాక్ అవుతారు. దేవయాని నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ రెండు నిమిషాలు ఆగండి అని అంటుంది. వసుధార లాంటి తెలివైన అమ్మాయిని మా రిషికి భార్యగా చేసుకోవాలని అనుకున్నాము. అన్ని అనుకున్నట్టుగా జరగవు కదా వసుధార ఎవరికి చెప్పాకుండా ఎవరినో పెళ్లి చేసుకుంది అనడంతో వసుధార షాక్ అవుతుంది. అప్పుడు అందరి ముందరే నన్ను మాట్లాడనివ్వమ్మా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా అని అంటుంది.
అప్పుడు వసుధార ని పొగుడుతూనే వ్యక్తిగత విషయాల గురించి పర్సనల్ విషయాల గురించి అందరి ముందులు చెబుతూ ఉంటుంది. కావాలనే అందరి ముందు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు అని అనడంతో వసుధార షాక్ అవుతుంది. వదిన గారు మీరు ఆగండి అనడంతో నువ్వు ఆగు మహేంద్ర నువ్వు చెప్పు వసుధార నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు అని పదేపదే పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార రిషి అన్న మాటలు తలుచుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దేవయాని పదేపదే నీ భర్త పేరు ఏంటో చెప్పు వసుధార అని అంటుండగా ఇంతలోనే రిపోర్టర్స్ చెప్పండి వసుధార గారు మీ భర్త పేరు ఏమిటి అని అనడంతో వసుధార షాక్ అవుతుంది.
అప్పుడు వాళ్లు పదేపదే గుచ్చి గుచ్చి అదే మాట అడుగుతూ ఉండగా వసుధార ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు దేవయాని చెప్పు వచ్చు కదా వసుధార అంతలా అడుగుతున్నారు కదా అని అంటుంది. ఇంతలో ఓపిక నశించిపోయిన జగతి రిషి వల్ల అని గట్టిగా అరవడంతో వసుధార షాక్ అవుతుంది. అప్పుడు జగతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వసుధార మెడలో తాళి పడడానికి కారణం రిషి అని అనడంతో వసు షాక్ అవుతుంది. రిషేంద్ర భూషణ్ నా కొడుకే వసుధార మెడలో తాళికి కారణం అని అనడంతో దేవయాని షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ జగతి నీ శిష్యురాల్ని వెనకేసుకుని రావడానికి అబద్ధాలు మాట్లాడుతున్నావా అనగా ఇదే నిజం అక్కయ్య అని అంటుంది జగతి.
నేను అవసరాల కోసం రిషి పేరు వాడుకునేంత స్థాయికి ఇంకా దిగజారలేదు వసు జీవితంలో రిషి ఉన్నాడు అని అనగా ఇంతలోనే అక్కడికి వచ్చిన రిషి ఆ మాట విని షాక్ అవుతాడు. వసు మెడలో తాళిపడ్డానికి రిషినే కారణం అనడంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. తప్పు మాట్లాడుతున్నావ్ జగతి వసుధర కోసం రిషిని బలి చేయకు అని అంటుంది దేవయాని. అప్పుడు దేవయాని రిషిని చూసి రిషి అనడంతో అప్పుడు అందరూ రిషి ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు దేవయానికి ఏమీ తెలియనట్టుగా రిషి దగ్గరికి వెళ్లి విన్నావా రిషి జగతి ఎంతమాట అనిందో అంటూ లేనిపోని మాటలు చెప్పి రిషిని రెచ్చగొడుతూ ఉంటుంది. అదే విషయం నువ్వు అక్కడికి వచ్చి చెప్పు అని రిషిని చేయి పట్టుకొని అక్కడికి పిలుచుకొని వెళ్తుంది దేవయాని. ఇప్పుడు దేవయాని స్టేజ్ పై అందరి ముందు రిషినీ నిలదీస్తూ నువ్వు ఆ తాళి కి కారణం కాదు అని చెప్పు రిషి అని అనగా రిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు.
