Asianet News TeluguAsianet News Telugu

`దేవర` ట్రైలర్‌ రివ్యూ.. ఈ రేంజ్‌లో సినిమా ఉంటే బాక్సాఫీసుకి చుక్కలే..

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న `దేవర` చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ వచ్చింది. కొరటాల శివ రూపొందించిన ఈ మూవీ ట్రైలర గూస్ బంమ్స్ తెప్పించేలా ఉంది. ఇందులో మెయిన్‌ హైలైట్స్ ఏంటంటే..
 

devara tralier out you never seen ntr like this goosbumbs arj
Author
First Published Sep 10, 2024, 5:16 PM IST | Last Updated Sep 10, 2024, 5:24 PM IST

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `దేవర`. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా కావడం విశేషం. సినిమా రిలీజ్‌కి దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది టీమ్‌. ఇప్పటికే గ్లింప్స్ వచ్చింది. అలాగే మూడు పాటలు వచ్చాయి. టైటిల్ సాంగ్ అదిరిపోయేలా ఉంది. మిగిలిన రొమాంటిక్‌ పాట సైతం ఆకట్టుకుంటుంది. అలాగే ఇటీవల రిలీజ్‌ చేసిన డాన్స్ నెంబర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ కి ఊపు తెస్తుంది. 

ఈ క్రమంలో ఈ మూవీ నుంచి బిగ్‌ అప్‌ డేట్‌ వచ్చింది. `దేవర`ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ముంబయిలో ఈ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. ఊరమాస్‌ పాత్రలో తారక్‌ అదరగొట్టారు. నెవర్‌ బిఫోర్‌ అనేలా ఆయన పాత్ర ఉంది. యాక్షన్‌ సైతం విరోచితంగా ఉంది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాబినయం చేస్తున్నారు. భయం అంటే తెలియని వాళ్లు పోర్ట్ లో దోపిడీకి పాల్పడుతుంటారు. వాళ్లకి భయం అంటే ఏంటో చూపించేందుకు వచ్చారు దేవర. ఆయన రాకతో అంతా సెట్ అవుతుంది. అయితే ఎన్టీఆర్‌తో స్నేహంగా ఉన్న సైఫ్‌ అలీ ఖాన్‌ ఆయనకు తెలియకుండానే వెనకాల కుట్రలు చేస్తారు. చంపేసేందుకు ప్లాన్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో దేవర మిస్‌ అవుతాడు. ఆయనకు ఏమైందనేది పెద్ద సస్పెన్స్. 

కట్‌ చేస్తే మరో దేవర(మరో ఎన్టీఆర్‌) ఎంట్రీ ఇస్తారు. ఆయనకు భయం ఎక్కువ. ధైర్యం లేదు. తన తండ్రి ఏమాయ్యాడో తెలుసుకోడు. పైగా ఆయనపైనే విమర్శలు చేస్తుంటాడు. ఈ క్రమంలో మళ్లీ దేవర ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? వచ్చిందే దేవరనా, లేక ఆయన కొడుకా? అనేది సస్పెన్స్ తో వదిలేశాడు దర్శకుడు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్ మేళవింపుగా ఈ ట్రైలర్‌ సాగింది. సినిమా కూడా ఇలానే ఉంటే బాక్సాఫీసుకి పూనకాలే అని చెప్పొచ్చు. అదే సమయంలో ప్రకాష్‌ రాజ్‌ ఇచ్చిన ఇంట్రో అదిరిపోయేలా ఉంది.

 


ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్‌ 27న విడుదల కాబోతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios